ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు ఈనెల 29న నిరుద్యోగ యువతీ యువకుల కోసం భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించబోతున్నామని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం భూమారెడ్డి ఫంక్షన్‌ హాళ్లో తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒపంపిక్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, యువ నేత బాజిరెడ్డి జగన్‌ తదితరులతో కలిసి ఆయన మెగాజాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఎమ్మెల్సీ కవిత చలవ వల్ల ఇందూరు ఐటీ హబ్‌లో ఉద్యోగాల కల్పన కోసం పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచ వ్యాప్తంగా పేరికగన్న కంపెనీలు క్యూ కుడుతున్నాయని, ఈ అద్భుత అవకాశాన్ని నిరుద్యోగ యువతీయువకులంతా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే జరిగే మెగా జాబ్‌మేళాతో చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, దీన్ని స్పూర్తిగా తీసుకుని ఎమ్మెల్సీ కవిత పలు పేరెకగన్న కంపెనీలతో సంప్రదింపులు చేసి ఇందూరులో కంపెనీలు పెడితే నిరుద్యోగ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు ఇందూరు వేదికగా మారతుందని ఆమె భావించారని, అందుకే పెద్ద ఎత్తున యువత ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిందిగా బాజిరెడ్డి కోరారు. టెన్త్‌ ఫెయిల్‌ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి మొదలుకొని,పీజీ,ఇంజినీరింగ్‌ చేసిన ప్రతీ ఒక్కరూ ఇందులో పాల్గొనాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.

You missed