ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న చోట సిట్టింగులకు చెక్‌పెడతారనే ఊహాగానాలకు ఇందూరులో క్లారిటీ ఇచ్చాడు మంత్రి కేటీఆర్. ఇందూరలోని ఐదు నియోజకవర్గల్లో కూడా సిట్టింగులే పోటీలో ఉంటారని ఆయన బహిరంగ సభ వేదికగా ప్రకటించేశాడు. ఐటీ హబ్ ప్రారంభానికి వచ్చిన కేటీఆర్.. పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. మామూలుగా ఏదైనా మీటింగులో లోకల్ ఎమ్మెల్యేను గెలిపించడంటూ ఆ ఎమ్మెల్యేకు సీటు గ్యారెంటీ అని క్లారిటీ ఇచ్చే కేటీఆర్.. ఇందూరులో మాత్రం ఒకడుగు ముందుకేశాడు.
ఇందూరులోని ఐదు నియోజకవర్గాల్లో అందరి సిట్టింగులకే టికెట్లు అని ప్రకటించేశాడు. నిజామాబాద్ అర్బన్ నుంచి బిగాల గణేశ్ గుప్తాను 55వేల మెజారిటీతో గెలిపించాలని కోరిన ఆయన.. మిగలిన సిట్టింగు ఎమ్మెల్యేలు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో సహా… మంచిగా, నిజాయితీగా పనిచేస్తున్నారని, వీరిని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని ఆయన కోరారు. దీంతో సిట్టింగులెవరికీ ఇందూరులో చెక్ పడబోదని మంత్రి కేటీఆర్ బహిరంగ సభా వేదిక సాక్షిగా కుండబద్దలు కొట్టారు. దీంతో సిట్టింగులు ఊపిరి పీల్చుకున్నారు.