నిజామాబాద్‌ కేటీఆర్‌ టూర్‌ నిరుత్సాహంగానే సాగింది. కారణం.. ఎమ్మెల్సీ కవిత రాకపోవడమే. కేటీఆర్‌ టూర్ షెడ్యూల్ ఖరారైన నాటి ఉంచి ఆమె అన్నీ తానై వ్యవహరించారు. మెగాజాబ్‌మేళా నిర్వహణ దగ్గర నుంచి ఐటీ హబ్‌ ప్రారంభోత్సవ ముస్తాబు వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అర్బన్‌, రూరల్ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకున్నారు. కేటీఆర్‌ ప్రోగ్రాంకు భారీ ఏర్పాట్లు, సన్నాహాలు విషయంలో కూడా దగ్గరుండి సూచనలు చేశారు. కానీ చివరకు ఆమె కేటీఆర్‌ ప్రోగ్రాంకు రాకపోవడంతో నిరుత్సాహపడ్డారు బీఆరెస శ్రేణులు. ఆమె కనిపించకపోడంతో ఉదయం నుంచే ఆరా తీశారు. ఆమె రాకపోవడానికి రాజకీయ కారణాలూ వెతికారు.

ఎవరికి తోచింది వారు అనుకున్నారు. ఎవరి అభిప్రాయలు వారు షేర్‌ చేసుకున్నారు. అన్న ప్రోగ్రాంకు అక్క లేకపోవడంతో ఏదో వెలితిని సూచించింది. నిరుత్సాహంగానే కార్యక్రమాలు జరిగాయి. పెండింగ్‌లో పడుతూ పడుతూ వచ్చిన ఈ ప్రారంభోత్సవాలకు మంచి ఊపు తీసుకొచ్చేలా కవిత చేసినా.. ఆమే ప్రారంభోత్సవాల్లో లేకపోవడం రాజకీయంగా చర్చకు తావిచ్చింది. ఇది బీఆరెస్‌లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా చర్చకు వచ్చింది. జ్వరం వల్ల రాలేదని కొందరు, సీఎం క్యాంపు కార్యాలయంలో పని ఉండి రాలేకపోయారని మరికొందరు ఏవో కారణాలు చెప్పినా.. ఆమె రాకపోవడానికి బలమైన కారణమే ఉందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమయ్యింది. ప్రతీనెల జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు ఆమె ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పడంతో ఇందూరు యువతలో కొత్త ఉత్సాహం వచ్చింది.

ఆమె చొరవతో కొత్త కంపెనీలు, పేరు మోసిన బడా కంపెనీలు ఇందూరు యువతకు జాబ్‌లు ఇచ్చేందుకు వస్తున్నాయనే ఆశాభావం పెరిగింది. ఈ నెల 29న భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌ మళ్లీ మెగాజాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని చెప్పిన కవిత.. ఇక ప్రతీనెల జాబ్‌మేళాలుంటాయని ఇందూరు యువతకు తీపి కబురు చెప్పారు. చివరకు ప్రాధాన్యత కలిగిన కేటీఆర్‌ ప్రోగ్రాంకు ఆమె లేపోవడం పెద్ద వెలితిగా భావిస్తుండగా..ఇందులో రాజకీయాలూ ముడిపడి ఉన్నాయనే కోణంలో కూడా చర్చించుకోవడం గమనార్హం.

 

 

 

You missed