నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంపీగా అర్వింద్ గెలవడాన్ని అడ్డిమారి గుడ్డిదెబ్బ కింద జమ కట్టారు. అనుకోకుండా అలా గెలిచేశాడని, అతనో నిరక్షరాస్యుడని, కుసంస్కారి అని ఘాటుగా తిట్ల దండకం అందుకున్నాడు. నాన్న వయస్సున్న కేసీఆర్‌ను నోటికొచ్చినట్టు తిడుతున్నాడని, అతని తండ్రి డీఎస్‌ను మేం అనలేమా..? కానీ మాకు సంస్కారం తెలుసు అంటూ ఎంపీ అర్వింద్‌కు చురకలంటించాడు కేటీఆర్.
నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా నీకు డిపాజిట్ కూడా దక్కదు.. ప్రజలకు తెలిసిపోయింది నీ గురించి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించి, ప్రజల దీవెనలతో రెండు సార్లు సీఎం అయిన డెబ్బైఏళ్ల వయస్సున్న కేసీఆర్‌పై నీ నోటికొచ్చినట్టు మాట్లాడతవా..? అంటూ ఫైర్ అయ్యాడాయన. హిందూ, ముస్లింల మధ్య మత విధ్వేషాలు రెచ్చగొట్టడమే తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏం ఉంది.? అని ప్రశ్నించారు. నయా పైసా అభివృద్ధి నిజామాబాద్‌కు చేయలేదు కాబట్టే నీకు ముఖం లేక ఈ మీటింగుకు రాలేదని ఎద్దేవా చేశాడు.