ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈ నెల 9న నిజామాబాద్‌ నగరానికి రానున్నారు. ఐటీ హబ్‌ ప్రారంభోత్సవానికి ముస్తాబైన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా జాబ్‌మేళా పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పదుల సంఖ్యలో కంపెనీలు హాజరయ్యారు. వేల సంఖ్యలో అభ్యర్థులు సాఫ్ట్ వేర్‌ ఉద్యోగాల కోసం బారుల తీరారు. ఇప్పటి వరకు 250 మందికి ఉద్యోగాలిచ్చారు. మిగిలిన వారికి మరోసారి నిజామాబాద్‌ లేదా హైదరాబాద్‌లలో ఇంటర్వ్యూలు నిర్వహించి జాబ్‌లు ఇప్పించే పనిలో ప్రభుత్వం ఉంది.

కొంగొత్త ఇన్నోవేషన్‌లకు ఇందూరు వేదిక కానుంది. దీనికి కేటీఆర్‌ రిబ్బర్‌ కట్‌ చేసి.. అభ్యర్థులతో ఇంటరాక్ట్‌ కానున్నారు. ఇదే కీలకమై ప్రోగ్రాం. దీంతో పాటు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్త కార్యాలయం, బొడ్డెమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌, దుబ్బ, వర్ని చౌరస్తాలలో అత్యున్నత హంగులతో ఏర్పాటు చేసిన వైకంఠధామాలను ఆయన ప్రారంభించనున్నారు. కేటీఆర్‌ రానున్న ఈ ప్రోగ్రాంకు అత్యంత ప్రాధన్యతనిస్తున్నది బీఆరెస్‌ జిల్లా పార్టీ. ఎన్నికల వేళ ఆసన్నమైన నేపథ్యంలో కేటీఆర్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తదితర కీలక నిజామాబాద్‌ నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో కేటీఆర్‌ రాక మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

You missed