ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో మూడు కొత్త కోర్సులు ప్రారంభం.. ఎస్‌ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్బన్ ఎం. మారయ్యగౌడ్
ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్న మూడు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ఎస్‌ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం. మారయ్యగౌడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో వివరించారు. బీటెక్ (సీఎస్‌ఈ) ప్రత్యామ్నాయంగా నాలుగు సంవత్సరాల బీఎస్సీ (హానర్ ఇన్ సీఎస్)ను ప్రారంభించడం జరిగింది. ఇంటర్‌లో ఎంపీసీ చదివి ఉండాలి. ఎంసెట్ సీటు సాధించని, దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులకు ఇది మంచి అవకాశం. బీఎస్సీ (హానర్ ఇన్ సీఎస్) పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్ (సీఎస్‌సీ)తో సరిసమానంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి.
బీబీఏ (రీటైల్ ఆపరేషన్స్): అర్హత ఇంటర్లో ఏదైనా కోర్సు ఉత్తీర్ణణ. ఈ కోర్సు తెలంగాణ యూనివర్సటీ మరి ఆర్‌ఏఎస్‌సీఐ (రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. కోర్సులో చేరిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ విధానంలో వారంలో మూడు రోజులు చదువు, మూడు రోజులు కొలువు చేసుకుంటూ నెలకు 10,000 వరకు స్టైఫండ్ పొందే అవకాశం కలదు. బీబీఏ (రిటైల్ ఆపరేషన్స్) పూర్తి చేసిన విద్యార్థులకు 20వేల వేతనంతో ప్లేస్‌మెంట్ గ్యారెంటీ కలదు.
బీబీఏ (హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్): అర్హత- ఇంటర్లో ఏదైనా కోర్సు ఉత్తీర్ణత. ఈ కోర్సు తెలంగాణ యూనివర్సిటీకి, హెచ్‌ఎస్‌ఎస్‌సీ (హెల్త్ కేఆర్ సర్వీసెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్) వారి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తారు. కోర్సులో చేరిన విద్యార్థులకు కార్పొరేట్ ఆస్పటిల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఉంటుందని మారయ్య గౌడ్ వివరించారు.