దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు ఆసరా పింఛన్‌ కింద జీవనభృతి ఇప్పించిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనని పలువురు వక్తలు కొనియాడారు. నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గ సంక్షేమ సంబురాల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యేతో పాటు పలువురు వక్తలు ఆమె చొరవ వల్లే బీడీ పింఛన్‌ వచ్చిందని, ఇది ఇప్పుడు ఎంతో మందికి ఆసరాగా నిలుస్తున్నదన్నారు. దేశంలో పది పన్నెండు రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నా .. వారి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదనే విషయం గుర్తు చేసుకున్నారు.

బీడీ పరిశ్రమ నానాటికి దివాళ తీస్తున్న తరుణంలో వారి కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు బీడీ పింఛన్‌ వచ్చేలా సీఎంతో మాట్లాడి కవిత ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. కొత్తగా బీడీ పింఛన్‌ రాని వాళ్ల బాధలను కూడా పట్టించుకున్న ప్రభుత్వం కటాఫ్‌ డేట్ ఎత్తేసి వారికి కూడా పింఛన్‌ వచ్చేలా చేస్తున్నామని కవిత అన్నారు. కాస్తో కూస్తో ఆర్థికంగా ఉన్న వారికి సంక్షేమ పథకాలు అందడం గొప్ప కాదని, ఏమీ లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే ప్రభుత్వం గొప్పతనమన్నారు. అదీ ప్రభుత్వమే వారిని గుర్తించి మరీ పథకాలను రూపొందించి వారికి అందేలా చేయడం తెలంగాణ ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమన్నారు.

You missed