తెలంగాణ యూనివర్సిటీ రగడ, రచ్చ రాజకీయం, పరువు ప్రతిష్టల ఇష్యూకు త్వరలోనే తెరపడనుంది. ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగిన తర్వాత… ఈ ఇష్యూ పై ఆమె సమగ్ర నివేదిక తెప్పించుకున్న పిమ్మట .. ఈసీ సభ్యుల సూచన, తీర్మాల మేరకు యాక్షన్‌లోకి దిగారామె. అంతే మంగళవారం ఏసీబీ, విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ టీం రంగంలోకి దిగి పూర్తిగా వర్సిటీని కంట్రోల్‌లోకి తీసుకున్నది. వీసీ పరారయ్యాడు. చేజ్‌ చేసి మరీ పట్టుకుని తీసుకొచ్చారు.

కీలకమైన ఫైళ్లు స్వాధీన పరుచుకున్నారు. వీసీ అరచకాలపై సమగ్ర నివేదిక రూపొందించి జైలుకు పంపాలంటే .. ఏసీబీ విశేషణాధికారాలు లేవు. దీంతో కచ్చితంగా గవర్నర్‌ ఆమోదం కావాలి. గవర్నర్‌కు కూడా వీసీపై సదాభిప్రాయం లేదు. ఏకంగా ఏబీవీపీ, బీజేపీ నాయకులు కూడా వీసీపై గవర్నర్‌కు ఫిర్యాదులు చేసి ఉన్నారు. దీంతో పాటు వర్సిటీకి ఆమె వచ్చిన సందర్భంగా వీసీ భార్యను తీసుకొచ్చి గవర్నర్‌ పక్కనే కూర్చోబెట్టాడు. ప్రొటోకాల్‌ నిబంధనలను పాతరేశాడు.

దీన్ని కూడా ఆమె సీరియస్‌గా తీసుకున్నది. దీంతో ఏసీబీ వీసీని ఉచ్చులో బిగించేందుకు గవర్నర్‌ నుంచి కూడా ఆమోదం దొరకుతుందనే భావిస్తున్నారు. అయితే ఆమె స్పందించని పక్షంలో కోర్టును సంప్రదించేందుకు కూడా ఏసీబీ రెడీ అయ్యింది. మొత్తానికి వీసీకి రోజులు దగ్గర పడ్డాయి. కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది. మరో వారం లేదా పది రోజులు అంతే. వర్సిటీ రచ్చ రాజకీయాలు పోయి ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు ఇంకెంతో సమయం లేదు. పరిస్థితులు అవే చెబుతున్నాయి.

You missed