వీవీ వినాయక్.. అగ్ర దర్శకుల్లో ఒకడు. ఒకప్పుడు. మంచి యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు తనదైన స్టైల్లో కామెడీని తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. తీసినవి కొన్నే సినిమాలు కానీ మంచి పేరు. అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. నాగార్జున మినహా అగ్ర హీరోలందరికీ హిట్లిచ్చాడు. కానీ తర్వాత అదృష్టం ముఖం చాటేసిందో.. కథల ఎంపికలో రాంగ్ స్టెప్స్ వేస్తూ పోయాడో తెలియదు కానీ ఫెయిల్యూర్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. అవకాశాలు రాక కనుమరుగవుతున్న తరుణంలో ఈ డైరెక్టర్లంతా చేతిలో పనికోసం వెతుకులాడేది ఫెయిల్యూర్ హీరోలనే. ఓ పూరి జగన్నాథ్, ఓ కృష్ణవంశీ, ఓ తేజ, ఓ వీవీ వినాయక్.. ఇంకా చాలా మందే ఉన్నారు.
వీవీ వినాయక్ అల్రెడ్ అల్లుడు శీను అంటూ బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా తీశారు. మంచి కథ, కామెడీ. ప్రకాశ్ రాజ్ నటనతో సినిమా అంతా నెట్టుకొచ్చాడు. కానీ ఏం లాభం. అసలు లోపం హీరోనే. అతనికి హీరోకుండాల్సిన లక్షణాలేవీ లేవు. కండలు పెంచుకుంటే చాలు.. స్టెప్పులు వేయడం వస్తే చాలు అనుకొని.. నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా పరిచయాలతో ఇలా హీరోగా వెలిగిపోదామని వచ్చాడు. కానీ ఎక్కడా ఏ హిట్టూ దక్కలేదు. అయినా ఇలా తెలుగు ప్రేక్షుకుల సహనానికి పరీక్ష పెడుతూనే ఉన్నాడు. ఇక ఇక్కడ ముఖం చూడటం లేదంటూ బాలీవుడ్‌కు బయలుదేరాడు శ్రీనివాస్. ఛత్రపతి సినిమాను హిందీలో దించుతున్నారు. వీవీ వినాయక్ దర్శకుడు. వినాయక్ కూడా అనుకొని ఉంటాడు తనకు తెలుగులో ఇక స్పేస్ లేదని. ఇక్కడే మీకు అవకాశాలు లేనప్పుడు బాలీవుడ్‌లో మిమ్మల్ని గుర్తు పట్టేదెవరు..? అంత సీన్ ఉందా..? ఈ శ్రీనివాస్‌కు.
పాపం … అనిపిస్తుంది వీవీ వినాయక్‌ను చూస్తే. తన కెరీర్‌ను ఇలా తన్నేసుకుంటున్నందుకు. వారసత్వ హీరోలంతా తెరమరుగవుతున్న తరుణంలో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం మానేసి ఇంకా అదే ఫాల్స్ హీరోయిజంతో నెట్టుకురావాలనుకోవడం వీరి మూర్ఖత్వం. ఆ మధ్య హీరో పాత్రకు అంతగా స్పేస్‌లేని డబ్బింగ్ సినిమా కథను రాక్షసుడు పేరుతో తెలుగులో తీశారు బెల్లంకొండ శ్రీనివాస్‌తో. పర్వాలేదనిపించింది. కానీ మళ్లీ అదే పంథా. చిరంజీవి మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ కూడా నేల విడిచి సాము చేశాడు. తర్వాత అసలు నిజం తెలుసుకున్నాడు. తనూ ఓ చిరంజీవి కావాలంటే అంత వీజీ కాదని. అందుకే విరూపాక్ష లాంటి కథలు ఎంచుకున్నాడు.