మన ఇందూరు పోరడు.. పాన్‌ ఇండియా హీరోగాడు

మోపాల్‌ మండలం కంజర గ్రామానికి చెందిన శీలం విరాజ్‌రెడ్డి సినిమా పూర్తి..

గార్డ్‌ పేరుతో పాన్‌ ఇండియా సినిమా నిర్మాణం… మూవీ ఫస్ట్‌ వర్షన్‌ రిలీజ్‌కు బాజిరెడ్డి ఫ్యామిలీ హాజరు..

ఇది యువతను ఆకట్టుకునే సినిమా : బాజిరెడ్డి గోవర్దన్‌

హైదరాబాద్‌ – వాస్తవం ప్రతినిధి:

మన ఇందూరు పిల్లగాడే.. ఏకంగా పాన్‌ ఇండియా సినిమాలో హీరోగా చేసే అవకాశం దక్కించుకున్నాడు. గార్డ్‌ పేరుతో వస్తున్న సినిమా పారా నార్మల్‌ జానర్‌లో తీశారు. హారర్‌, ప్రతీకారం, ప్రేమ కలబోతలతో ఆసాంతం ఆసక్తిగా, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను చైనా, ఇంగ్లీష్‌, తమిళ్, మళయాళం తదితర భాషలో తెరకెక్కించారు. మొత్తం ఆస్ట్రేలియాలో ఈ సినిమాను షూట్ చేశారు. అంతా కొత్త తారగణం. హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన ఫస్ట్‌ వర్షన్‌ రిలీజ్‌కు ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, బాజిరెడ్డి జగన్‌ ఫ్యామిలీ హాజరయ్యారు.

బాజిరెడ్డి గోవర్దన్‌ మేనల్లు శ్రీనాథ్‌కు హీరో శీలం విరాజ్‌ రెడ్డి ఫ్రెండ్‌. బాజిరెడ్డి ఈ సినిమాకు పెద్ద దిక్కుగా నిలిచారు. సినిమా పేర్లలో బాజిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు ముందు విరాజ్‌ వన్ మాన్‌ ఆర్మీ అనే సినిమా కూడా తీశాడు. అదింకా రిలీజ్‌ కాలేదు. ఇరవై శాతం ఇండియాలో షూటింగ్‌ అయ్యిందీ సినిమా. ఇందులో అడివి సీన్లు మన చీమన్‌పల్లిలోనే తీశారు. జగన్‌ ఈ షూటింగ్‌ తన సహాయ సహకారాలు అందించారు.

మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన విరాజ్‌… డిగ్రీ వరకు హైదరాబాద్‌లోనే చదివాడు. ఇలా తనకు వచ్చిన అరుదైన సినీ అవకాశాన్ని వినియోగించుకుని తొలిసారే పాన్‌ ఇండియా లెవల్‌లో హీరోగా తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. బాజిరెడ్డి ఈ సినిమా ఫస్ట్ వర్షన్‌ చూసి సంతోషించారు. సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని ప్రశంసించారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

You missed