ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య. కాంగ్రెస్ దేశంలో ఫెయిలయ్యింది బీజేపీ ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. టీఆరెస్ ఉద్యమ పార్టీగా అవతరించి ఎవరూ సాధించలేని తెలంగాణను ప్రాణాలకు తెగించి కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధించడమే కాదు.. అరవై సంవత్సరాలుగా వెనుబడిన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కంటే ముందుకు తీసుకెళ్లి.. దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలపడంలో కేసీఆర్ సఫలీకృతులయ్యారు. ప్రతీ విషయంలో దేశంలో నెంబర్‌వగా తెలంగాణ నిలుస్తూ వస్తోంది. బీజేపీకి ఇష్టమున్నా లేకపోయినా కేంద్రం చేతుల మీదుగా తెలంగాణ అవార్డులు తీసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశాన్ని కూడా గాడిలో పెట్టేందుకు సమయం ఆసన్నమైందని గుర్తించి టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో సక్సెస్ కూడా అయ్యారు. రాష్ట్రాలను కూల్చి.. సీఎంలను మార్చే బీజేపీ వైఖరికి అంతా భయపడ్డారు. అందుకే కేంద్రం జోలికి ఎవరూ పోలేదు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి అనుసరించి… మోడీని వ్యతిరేకించే కేజ్రీవాల్ ఇద్దరూ జతకట్టారు.
ఆప్ కూడా రెండు రాష్ట్రాల్లో విస్తరించింది. వీరిద్దరూ కలిసి బీజేపీ మీదకు ఎక్కడ వస్తారో అనే భయం మోదీకి పట్టుకుంది. ఢిల్లీ ప్రభుత్వంలో రెండోస్థానంలో ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి… రెండు పార్టీలకు ఇబ్బంది కలిగించాలి, వీరిని అభాసుపాలు చేయాలి… వీరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోని ఈ లిక్కర్ స్కాంను తెరపైకి తీసుకొచ్చిండ్రు. దీన్ని డ్రామాగా మార్చారు. బీజేపీ దేశంలో అత్యధికంగా చాలా రాష్ట్రాల్లో పరిపాలిస్తోంది. ఈ పార్టీలోని ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు వీళ్లంతా సత్తెపూసలా..?కర్ణాటకలో ఎమ్మెల్యే దగ్గర 20 కోట్లు దొరికాయి… వారి మీద ఏం కేసులు పెట్టిండ్రు..? ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసులతో ఇబ్బందులు పెట్టడం.. బీజేపీలో చేరితో కేసులను ఎత్తివేయడం దేశంలో పరిపాటిగా మారింది. ఉదాహరణకు ఇక్కడ సీఎం రమేశ్, సుజనా చౌదరిల ఉదంతాలు చూడొచ్చు. కేవలం రాజకీయ దురుద్దేశంతోని తప్ప ఎలాంటి స్కాంలు, ఎలాంటి స్కీంలూ లేవు.
దేశం కోసం, రాష్ట్రం కోసం పోరాడిన నాయకులు జైళ్లకు పోయారు. తెలంగాణ సాధన కోసం జైళ్లకే కాదు.. ప్రాణాలివ్వడానికి కూడా సిద్దపడిన నాయకులంతా టీఆరెస్‌లో ఉన్నారు. జైళ్లు, అరెస్టులంటే ఎవరూ బెదిరేది లేదు. అదిరేది లేదు. ఇప్పటికే దేశ ప్రజలందరికీ అర్థమైంది. కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నారు కాబట్టి ఇక్కడనే కట్టడి చేయాలనే ఉద్దేశంతో, ఆయన మనోభావాలను దెబ్బకొట్టాలనే ఉద్దేశ్యంతో కూతురు కవితను టార్గెట్ చేసిండ్రు. ఇప్పటికే కవిత చెప్పారు.. సీబీఐ, ఈడీ ఎవరొచ్చినా..మేం సహకరిస్తామని. చట్టాలను గౌరవిస్తాం.. ఎవరికీ భయపడేది లేదు. సహకరిస్తాం.
బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే…