ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో హడలెత్తిస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక పార్టీని నిలబెట్టేందుకు బీఆరెస్‌ ఎత్తుకుపై ఎత్తు వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం బీఆరెస్‌కు బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పేందుకు మరో ఊతమచ్చింది. ఇప్పటి వరకు రైతులు తమ సొంత స్థలాలలో కట్టకున్న కళ్లెలాలకు సంబంధించిన అమౌంట్‌ను తిరిగి ఇచ్చేయాలని, కట్టేవి ఆపేయాలని కేంద్రం జీవో రిలీజ్‌ చేసింది. ఇది బీఆరెస్‌కు కలిసి వచ్చింది. అసలే ఉద్యమ పార్టీ. ఆందోళనకు వెనక్కి తగ్గని పార్టీ. పైగా బీఆరెస్‌ నాయకులపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడలతో హడలెత్తిస్తూ చిర్రెత్తుకునేలా చేస్తుంది.

ఈ క్రమంలో ఇక బీజేపీని ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో మహా రైతు ధర్నా పేరిట బీజేపీ తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టేండుకు డిసైడ్‌ అయ్యింది పార్టీ. మీరు కేసులతో భయటపెట్టాలని చూస్తే.. మేం మీ ప్రజావ్యతిరేక పాలన పాలసీపై పంజా విరుసుతాం అనే రేంజ్‌లో కేసీఆర్‌ తనదైన శైలిలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అసలే ఎన్నికల సీజన్‌. ఇది మరింత వేడెక్కనుంది. రోజుకో ధర్నా..పూటకో ప్రస్‌మీట్‌ పెట్టి చెడామడా రెండు పార్టీలు విమర్శలు, ప్రత్యారోపణలు చేసుకునేందుకు ఇక వేళయ్యింది. అది మరింత ముదిరింది.

You missed