కేసీఆర్‌.. ఏది చేసినా ఓ వ్యూహం ఉంటుంది. ఏం మాట్లాడినా దానికో మర్మముంటుంది. ఏది చెబితే దానికి రివర్స్‌ ఫలితం ఉంటుంది. రెండోసారి సిట్టింగులకే టికెట్లిచ్చాడు. మూడోసారీ మీకే అన్నాడు. కానీ ఎమ్మెల్యేలపై చాలా చోట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. వాళ్లకే మళ్లీ టికెట్లిస్తే అంతే సంగతులు.. ఈ సంగతి కేసీఆర్‌కు తెలుసు. కానీ ఇప్పుడే ఎందుకు అయోమయం క్రియేట్ చేయాలని… మళ్లీ సిట్టింగులకే అని ఓ చల్లని తీపి కబురు చెప్పి ఎవరు పనులు వారు చేసుకునేలా చేశాడు. కానీ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. కొందరిని చెక్‌ పెట్టాలి. తప్పదు. లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ఎర్రబెల్లి చేత ఓ సర్వే పేరుతో ట్రయిలర్‌ వదిలాడు కేసీఆర్‌.

25 మందిపై ప్రజా వ్యతిరేకత ఉంది అంటూ ఎర్రబెల్లి ప్రకటించేశాడు బాహాటంగా. సీఎం కేసీఆర్ గురించి తెలిసీ…పార్టీకి సంబంధించిన వ్యవహారంలో అంత ధైర్యంగా తను ఓ సర్వే చేయించానని, అందులో ఇదీ ఫలితమంటూ ప్రకటించే దమ్ము ఎర్రబెల్లికి ఉందా..? వెనుకు కేసీఆర్‌ ఆజ్ఞలు లేకపోతే అంత తెగింపుకు దిగుతాడా..? అసాధ్యం. అసలు విషయం ఏంటంటే ఎర్రబెల్లి చెప్పింది 25 మందే. కానీ కేసీఆర్‌ నజరలోకిచ్చింది 40మంది ఎమ్మెల్యేలు. ఇక లుకలుకలు స్టార్ట్‌ అయ్యాయి. ఎవరికి ఎసరు పెడుతాడో అనే అంశం ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. చివరిదాకా ఈ సినిమాలో సస్పెన్స్‌ కొనసాగిస్తాడు కేసీఆర్‌. ట్రయిలర్‌ వదలడం వెనుక.. సీటు పై ఆ ఎమ్మెల్యేలు ఆశలు వదులుకోండ్రా అని చెప్పడమే అన్నమాట. అవునూ… ఇంతలా సర్వే చేసిన ఎర్రబెల్లి అసలు గెలుస్తాడా..? ప్రజలు ఏమనుకుంటున్నారో..? ఆయన గెలుపు కూడా కష్టమేనని ఆ సర్వేలో తేలినా ఆశ్చర్యపోనవసరం లేదు.

You missed