ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను నిన్న విచారించిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి ఈ వేదికగా ఆమె తను ప్రసంగించారు. నిప్పులు కక్కారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆమె మీడియా తీరును ఎండగట్టారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండేలను మీడియా మోస్తున్నదని, ఇదేం జర్నలిజమంటూ ఏకిపారేశారు. కానీ ఒకప్పుటి మీడియా సంస్థలకు, ఇప్పటి మీడియాకు చాలా తేడా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. పార్టీల వారీగా మీడియా విడిపోయింది. ఏ పార్టీ బాకా ఊదేందుకు ఆయా పత్రికలు పుట్టుకొచ్చాయి. మీడియా ముసుగులో ఇది దేశ వ్యాప్తంగా జరుగుకతున్నదే.ప్రజాస్వామ్య పరిరక్షణ కేవలం సంభాషణలు, ప్రసంగాల్లో వినిపిస్తున్నంత బలంగా ఆచరణలో పార్టీలేవి చూపడం లేదు.

అధికార పార్టీతో సహ. ప్రతిపక్షాన్ని లేవనీయకుండా అసలు అది బతకే ఉండకుండా చేసిన ఉదంతాలూ మనదగ్గరా ఉన్నాయి. ఇప్పుడు దేశం మీద, మీడియా మీద, పార్టీల మీద ఎంత మాట్లాడినా.. ఏదో ఒక చోట మనం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి. సీబీఐ, ఈడీ దాడులు తన మీదే కాదని, ఇవేం దేశంలో కొత్త కాదన్న కవిత… తెలంగాణ ఆడబిడ్డ కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వస్తాయని అన్నారు. ఇక పై రాష్ట్ర కమిటీల్లో ఉన్న వారంతా దేశ వ్యాప్తంగా వివధ రాష్ట్రాల్లో పనిచేయడానికి సిద్దంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారామె. ఆమె ప్రసంగం ఓ ఊపునైతే ఇచ్చింది జాగృతి నేతలకు. భవిష్యత్ కార్యాచరణపై వేదికపై మాట్లాడకున్నా.. ఇక రేపటి నుంచి జిల్లాల వారీగా ఉద్యమ కార్యాచరణ ఒకటి తీసుకుని బీఆరెస్‌తో సంబంధం లేకుండా బీజేపీపై పోరుకు జాగృతి రెడీ అవుతందనే సంకేతాలు అందాయి ఈ వేదికగా.

You missed