కాంగ్రెస్‌ను ఎవరూ బొంద పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పాతాళంలోకి తొక్కి ఘోరి కట్టాల్సిన పనీ లేదు. కేసీఆరే బాగా కష్టపడ్డాడు పాపం… ఎక్కడ కాంగ్రెస్ తనకు ప్రత్యామ్నాయం అయి కూర్చుంటుందో.. అని ఎమ్మెల్యేలను ఎడాపెడా కొనిపడేశాడు. కానీ తర్వాత గానీ ఆయనకూ తత్వం బోధపడలేదు. ఏందంటే… దాన్ని వేరొక్కరు ప్రత్యేకంగా ప్లాన్ చేసి చంపాల్సిన పనిలేదు. అందులోని సీనియర్లే చాలు చంపి పాతరేసేందుకు. రేవంత్‌కు ఏనాడైతే పీసీసీ చీఫ్ కట్టబెట్టారో అప్పట్నుంచే ఉంది ఈ ముసలం. అసంతృప్తి. ఇలా రాజుకుని రాజుకుని అగ్గి భగ్గుమన్నది పీపీసీ కమిటీలు వేసిన తర్వాత. జిల్లాకు డీసీసీ అధ్యక్షుల నియామకం తో వీరికి మంచి సాకు దొరికింది.
ఒక్క చోట గూమిగూడారు. మీటింగు పెట్టుకున్నారు. సేవ్ కాంగ్రెస్ అని కొత్త నినాదం అందుకున్నారు. అసలు చంపిందే మీరు. అవునూ.. చిన్న లాజిక్ మిస్సయ్యార్రా బాబులు మీరు. రేవంత్‌ను ఎంపిక చేసింది ఎవరు..? పైన రాహుల్, సోనియానే కదా. మరి మీకు పార్టీ మీద, పెద్దల మీద, అధిష్టానం మీద గౌరవం, మ ర్యాద ఉంటే వాళ్ల నిర్ణయానికి కట్టుబడి ఉండి పనిచేసుకోవాలి కదా. అలా కుదరదంటారా..? మరెందుకు రేవంత్ వచ్చి పడ్డాడు…? అసలు రేవంత్ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది…? మీరు సక్కగ లేకనే కదా. మీలో ఐక్యత లోపించే కదా. మీకు అంత సీన్ లేకనే కదా. ఇప్పుడు మరి వచ్చినోడిని సపోర్టు చేయకుండా.. పార్టీని బలోపేతం చేసి జనాల్లో నమ్మకం ప్రోది చేసుకోకుండా ఇంకా ఇలా మీలో మీరే తన్నుకుంటూ.. దానికి సేవ్ కాంగ్రెస్ అని పేరుపెట్టుకుని…. థూ.. మీ బ చె. ఇక మీరు మారరు. పార్టీని లేపరు. దానికి జీవగంజి పోయరు.