కొంద‌రికి కాలం అలా క‌లిసి వ‌స్తుంది. అనుకోకుండా తెర‌పైకి వ‌స్తారు. వ‌రాల జ‌ల్లు కురుస్తుంది. ప‌ద‌వులు ఇంటి గుమ్మం వ‌చ్చి త‌డుతాయి. అప్ప‌టి దాకా అత‌నెవ‌రో కూడా జ‌నాల‌కు తెలియ‌దు. ఒక్క‌సారిగా ప్ర‌పంచం క‌ళ్ల‌లో ప‌డ‌తాడు. అలాంటి ప‌రిస్థితులు వ‌చ్చి ప‌డ‌తాయి. అది కాల మ‌హిమ‌. హుజురాబాద్ ఉప ఎన్నిక రావ‌డం.. ఈట‌ల రాజేంద‌ర్ పుణ్య‌మా అని కౌశిక్ రెడ్డి అనే లీడ‌ర్ కు అనూహ్యంగా అవ‌కాశం వ‌చ్చింది. ఎమ్మెల్సీ కావ‌డానికి. ఎమ్మెల్సీ చేయ‌డానికి కేసీఆర్ కూడా. ఎమ్మెల్సీ కోటాలో అస‌లు కౌశిక్ రెడ్డి ప‌నికే రాడు అనేది గ‌వ‌ర్న‌ర్ అభిప్రాయం.. ఒక‌ర‌కంగా ఇది అంద‌రి అభిప్రాయం కూడా.

కానీ ఎలాగోలా అలా ఎమ్మెల్సీ అయ్యాడు. కానీ ఇప్పుడు అది సంతృప్తినివ్వ‌డం లేదంటా. ఎమ్మెల్యే కావాలని కోర‌కుంటుండు. త‌న‌ను గెలిపించాల‌ని కూడా ఇప్పుడే ప్ర‌జ‌ల‌ను వేడుకుంటుండు. టికెట్ అప్పుడే వ‌చ్చిన‌ట్టు.. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు ఊహాలోకంలో కూడా విహ‌రించేస్తున్నాడు. పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి సేవ‌లు చేస్తూ.. క‌ళ్లు క కాయ‌లు కాచేలా ఎదురుచూస్తూ.. చ‌స్తూ, బ‌తుకుతూ.. బ‌తికే ఉన్నామా..? ప‌ద‌వి వ‌చ్చే దాకా బ‌తికి ఉంటామా.? అని జీవ‌చ్చ‌వాళ్ల బ‌తికే జీవులు .. ఇక్క‌డ టీఆరెస్‌లో ఎంతో మంది ఉన్నారు. పాపం మ‌రి వారెలా అనుకోవాల‌ని కౌశిక్‌….. దేనికైనా హ‌ద్దుండాలి. ఆశ‌కు కూడా. మ‌రీ ఇలా అత్యాశ ప‌నికి రాదు. మ‌రీ ఇంత‌లా దురాశ వ‌ద్దు. తెలుసు క‌దా దుఃఖానికి చేట‌ని. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ అయి.. ఏమోమో కోరుకుంటూ అలా ఆశ‌ల‌లోకంలో విహ‌రించొద్దు…! నువ్వెవ‌రోయ్‌.. చెప్ప‌డానికి. కాలం క‌లిసి వ‌చ్చింది కాబ‌ట్టి ఎమ్మెల్సీ అయిన‌. రేపు మ‌ళ్లీ ఇదే కాలం క‌లిసి రాదా..? క‌ల నిజం చేసుకోవ‌డం కోసం ఏమైనా చేస్తా… ఏమైనా అంటే….

ఏమైనా అంటే… ఏమైనా అంటే…

పార్టీ మారుతా..!!

అంతేనంటావా..? ఓకే ప్రొసీడ్‌…..

You missed