అర్వింద్ ఇంటిపై దాడి జ‌రిగింది. టీఆరెస్ చేసింది. దాడిని ఖండించాలి. ఇది క‌రెక్టు కాదు. కానీ ఇక్క‌డ బీజేపీ కొత్త సెంటిమెంట్ ప్లే చేసింది. య‌తావిధిగా.. ష‌రా మామూలుగా. అదేంటంటే…. మొన్న అర్విందేమో మా అమ్మ‌ను బెదిరించారు. భ‌య‌పెట్టారు.. ఎవ‌రిచ్చారు మీకు హ‌క్కు అంటు నిల‌దీశారు. కానీ ఆ స‌మ‌యంలో ఆమెకు దాడి గురించే తెలియ‌ద‌ని చెప్ప‌డంతో నాలుక్క‌రుచుకోవ‌డం అర్వింద్ వంతైంది ష‌రా మాములుగా. అల‌వాటుగా. దేవుళ్ల ప‌టాల‌ను ధ్వంసం చేశార‌నీ అన్నాడు. కానీ అవేవీ అక్క‌డ క‌నిపించ‌లేదు. ఇప్పుడు బండి సంజ‌య్ కూడా ఇదే రాగం అందుకున్నాడు. అందులో అమ్మ ప్ర‌స్తావ‌న లేదు కానీ.. కొత్తగా తుల‌సీ మొక్క కుండీని ఎత్తేశారు అన్నాడు. ఇంటిపై దాడి చేస్తే బాధ లేదు కానీ.. తుల‌సి మొక్క కుండీ ఎత్తేయ‌డం బాధ‌నిపించింది అన్నాడు.

అంతే కాదు.. ఇంట్లో ఏఏ దేవుళ్ల ఫోటోలు ధ్వంసం చేశారో కూడా పేర్ల‌తో స‌హా చెప్పాడు. బ‌హుశా అన్ని దేవుళ్ల ఫోటోలున్న‌ట్టు అర్వింద్‌కు కూడా తెలుసో లేదో…?? ఇక్క‌డ దేవుళ్ల ఫోటోలను ధ్వంసం చేయ‌డం అనేది ఎవ్వ‌రూ ఒప్పుకోని అంశం. ఎందుకంటే అక్క‌డ దాడి చేసింది టీఆరెసోళ్లు. సోయి లేకుండా ఓ అధికారి పార్టీ కి చెందిన కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌ను బెదిరించ‌డం, దేవుళ్ల ఫోటోల‌ను ధ్వంసం చేయ‌డం…. లాంటివి చేస్తారంటే ఎవ‌రు న‌మ్మ‌రు. టీఆరెస్ ను వెనుకేసుకొస్తున్నాన‌ని అనుకోకండి…. ఇంత వ‌ర‌కు టీఆరెస్ ఎలాంటి దాడుల‌కు తెగ‌బ‌డ‌లేదు. ఇది ఆవేశంతో చేసిందే. కానీ అది త‌ప్పే. ఖండించాల్సిందే. కానీ బీజేపీ దీన్న అడ్వాంటేజీగా తీసుకుని పార్టీ మైలేజీ కోసం మ‌రింత అబ‌ద్దం ఆడే ప‌రిస్థితే ఎవ‌రూ న‌మ్మేలా లేదు. ఇప్ప‌టికే బండి సంజయ్ త‌డిబ‌ట్ట‌ల‌తో యాదాద్రికి పోయిన సంగ‌తి … ప్ర‌జ‌ల‌కు తెలుసు. అదెంత తిర‌గ‌బ‌డిందో. ఎంత‌లా క్రెడిబిలిటీ దెబ్బ‌తీసిందో. ఇప్పుడూ అదే ప్లాన్.. అదే విధానం. ప్ర‌తీసారి దేవుళ్ల సెంటిమెంట్ ప‌నిచేయ‌దు. మాట్లాడితే బ‌లంగా ఉండాలి. కౌంట‌ర్ ఇస్తే దిమ్మ‌దిర‌గాలి. ఇలా తుల‌సిమొక్క‌, దేవుళ్ల ఫోటోలు.. అంటూ పాత పోక‌డ‌లు పోతే… పిడుగుకు, బియ్యానికి ఒకే మంత్రం అనేదో అంటారు అలా ఉంటుంది క‌థ‌.

You missed