కేసీఆర్ స్పీచ్ అంటే ప‌డిచ‌చ్చేవాళ్లెంతో మంది… పార్టీల‌తో సంబంధం లేకుండా. ఎంత విన్నా వినాల‌పిస్తుంది. గంట‌ల త‌ర‌బ‌డి సాగే ఆ స్పీచ్ ఎక్క‌డా బోరు కొట్టించ‌దు. సుత్తి లా అనిపించ‌దు. తెలంగాణ యాస‌, భాష .. సంద‌ర్బోచితంగా సాగే వాడుక ప‌దాలు.. సామెత‌లు.. సెటైర్లు… న‌వ్వు తెప్పిస్తాయి. ఆవేశం క‌లిగిస్తాయి. ఆలోచ‌న రేకెత్తిస్తాయి. మొత్తంగా క‌మ్మ‌టి తెలంగాణ భోజ‌నం చేసిన‌ట్టుగా బ్రేవ్ మ‌నిపిస్తాయి. స‌రే, కొన్ని సార్లు అదే రోటీన్ రొడ్డ కొట్టుడు స్పీచ్ కొంత బోర్ తెప్పించొచ్చు. ప్ర‌స్టేటేడ్ స్పీచ్ కొంత పంటికింద రాయిలా అనిపించొచ్చు. కానీ, అంతిమంగా స‌భికుల‌ను ఆక‌ట్టుకునే స్పీచ్‌. కేసీఆర్ స‌భ అంటే ఇప్ప‌టికీ త‌గ్గ‌ని క్రేజ్ అదంతే. కౌంట‌ర్లిచ్చినా… మాట‌ల‌తో ఎన్‌కౌంట‌ర్ చేసినా.. అంతా ఆయ‌న‌కే చెల్లింది.

మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో నిన్న జ‌రిగిన స‌భ స‌క్సెస్ అయ్యింది. త‌న బ‌లం, బ‌ల‌గాన్ని చూపిన కేసీఆర్… అదే స్థాయిలో ఆవేశంగా స్పీచ్ ఇచ్చాడు. ఈ ఎన్నిక‌ను ఆయ‌న అంత ఆషామాషీగా తీసుకోలేదు. బీజేపీ తీసుకోలేదు. అందుకే ఇక్క‌డ హోరాహోరీ పోరు సాగ‌నుంది. ఈ రోజు అమ‌త్ షా మీటింగు. ఆయ‌న హిందీ ప్ర‌సంగం .. అర్ద‌మ‌య్యేదెంద‌రికీ..? అందులో పంచులు రీచ్ అయ్యేదెంత‌మందికి..?? క‌నీసం అనువ‌దించే వారుండ‌రు. పోనీ ఇక్క‌డ ఉన్న నేత‌లద‌న్నా స్పీచ్ ప‌వ‌ర్ ఫుల్ గా, స‌బ్జెక్ట్‌తో కూడి ఉంటుందా అంటే అదీ లేదు. బండి సంజ‌య్ స్పీచ్‌లో స్ప‌ష్ట‌త ఉండ‌దు. కిష‌న్‌రెడ్డిదీ లోక‌ల్ మేడ్ స్పీచ్‌. అదీ స‌భికుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా ఉండ‌దు. మ‌రోసారి కూడా కేసీఆర్ స‌భ ఇక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. ముందు ముందు ఇక్క‌డ స‌భ‌ల మ‌హా రంజుగా ఉండ‌నున్నాయి. బీజేపీ క‌న్నా… కాంగ్రెస్ క‌న్నా.. టీఆరెస్ స‌భ‌లే ఇక్క‌డ స‌క్సెస‌వుతాయి. స‌భ స‌క్సెస్‌ల‌తో ఓట్లు ఎన్నిరాలుతాయో చూడాలి.

You missed