సీఎం కేసీఆర్ నిన్నోమాట‌న్నాడు స‌భ‌లో. ఇంకా చాలా మంది రోడ్ల మీదే ఉన్నారు స‌భ‌కు రావాల్సిన‌వాళ్లు. వాళ్లంతా స‌మ‌యానికి రాలేక‌పోయార‌ని. వీళ్లంతా హైద‌రాబాద్ నుంచి వ‌స్తున్నార‌ని ఆయ‌నే ప్ర‌త్యేకంగా, ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చెప్పుకొచ్చాడు. అవునూ.. జ‌రిగ‌బోయేది మునుగోడు ఉప ఎన్నిక. వ‌స్తే గిస్తే ఆ నియోజ‌క‌వ‌ర్గం లేదా చుట్టుప‌క్క‌ల జ‌నం రావాలి. త‌ర‌లించాలి. స‌రే పైస‌లివ్వందే ఎవ‌డూ రాడు. అది అంద‌రికీ తెలుసు. వాళ్లింతిచ్చిర్రు అంటూ ఓ పార్టీ మ‌రోపార్టీపై ఏవో సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. అంతా అవే తాను ముక్క‌లు.

స‌రే, ఈ విష‌యం వ‌దిలేస్తే…. జ‌నం హైద‌రాబాద్ నుంచి రావ‌డ‌మెందుకు..? అధికార పార్టీ కాబ‌ట్టి… మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు సీఎం ఒక్క సైగ చేస్తే వంద‌లాది జ‌నం అక్క‌డికి చేరుకుంటారు. అలా చేస్తారు టీఆరెస్ ప్ర‌జాప్ర‌తినిధులు. దీనికే అంత గ‌ప్పాలు కొట్టుకోవ‌డ‌మెందుకు..? పైగా ఇది సిగ్గుప‌డాల్సిన విష‌యం. ట్రాఫిక్ ఇబ్బందుల‌ను క్రియేట్ చేసి జ‌నాన్ని న‌ర‌కం చూపించి స‌భ స‌క్సెస్ అయింద‌నిపించుకోవ‌డానికి జ‌న‌బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయ‌డం కాక‌పోతే … మ‌రేమిటి…? దీనిపై వీ6లో మంచి ప్రోగ్రామే చేశారు. జ‌నం ట్రాఫిక్‌లో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.

మ‌రి ఇవాళ బీజేపీ స‌భ‌. అమిత్ షా వ‌స్తుండు. సేమ్ అదే సీన్ రిపీట్‌. ఇప్పుడు ఎవ‌రూ చేయాలే ట్రాఫిక్ ఇబ్బందుల ప్రోగ్రాం. ఇంకెవ‌రు టీ న్యూస్ చేయాలె. సిగ్గు లేకుండా ఒక‌రిపై ఒక‌రు ఇలా చేసుకోవాల‌న్న‌మాట ప్రోగ్రాంలు. ఓ మేథావి ఫేస్‌బుక్కులో టీఆరెస్ జనాన్ని హైద‌రాబాద్ నుంచి విపరీతంగా త‌ర‌లించి త‌న శ‌క్తిని చాటుకుంద‌నే రీతిలో పోస్టింగు పెట్టాడు. సిగ్గుండాలి. జ‌నాన్ని హైద‌రాబాద్ నుంచి ఎందుకు త‌ర‌లించాల‌నే సోయి మ‌న మేథావుల‌కు లేదు. కేసీఆర్ ప్రాప‌కం కోసం ఆయ‌న ఏది చేసినా భేష్‌.. భేష్‌.. భ‌లే భ‌లే…. అని భ‌జ‌న చేసి త‌రించాలంతే.

You missed