పాపం.. కాంగ్రెస్‌. ఎలా ఉండేది. ఎలా అయ్యింది. కేసీఆర్ దెబ్బ‌కు అది ఉనికి కోల్పోయి త‌న‌ను తాను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నంలోనే ఉంది ఇంకా. కాంగ్రెస్‌ను కాపాడే వీరుడు.. శూరుడు ఒక్క రేవంత్‌రెడ్డే అని న‌మ్మి టీపీసీసీ ఇస్తే.. అత‌ను రెచ్చిపోయి ఏదో చేద్దామ‌ని ఇలా అంద‌రి తిర‌స్క‌ర‌ణ‌కు గురై… సారీ.. సారీ అని అంద‌రి క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాడు. రేవంత్ పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్ కు ఇక తిరుగులేద‌నుకున్నారంతా. వాపును చూసి బ‌లుప‌నుకున్నారు. అదే రేంజ్‌లో రెచ్చిపోయిన రేవంత్ నేల విడిచి సాము చేసి .. మ‌ళ్లీ నేల క‌రుచుకున్నాడు. ఇప్పుడు ఇలా కాళ్లు మొక్కే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు.

ఇంత‌కు మించి .. ఇంత‌క‌న్నా మంచి కార్య‌క్ర‌మ‌మేమీ అత‌ని అమ్ముల పొదిలో లేద‌నుకుంటా బ‌హుశా… అందుకే మునుగోడులో కాళ్లు మొక్కుతూ గోడు గోడున ఏడుస్తూ ఇంటింటికీ తిరిగే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. కాళ్లు మొక్కి ఓట్లేయించుకున్నా.,. గెలిచినోడు ఆ పార్టీలో ఉండ‌డ‌నే అపార‌న‌మ్మ‌కాన్ని క‌డిగేయాలంటే కాళ్లు మొక్కుడే కాదు.. వాళ్ల కాళ్లు కూడా క‌డ‌గాలేమో రేవంత్‌… ఇది కూడా జ‌ర ఆలోచించు…!!