పీఎం మోడీ హైద‌రాబాద్ రాక నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ హాజ‌ర‌వుతారా..? లేదా..? అనే విష‌యంలో ఎన్నో మ‌లుపులు చోటు చేసుకున్నాయి. చివ‌ర‌కు ఆయ‌న పోనే లేదు. జ్వ‌రం వ‌చ్చింద‌నే మెసేజ్‌తో సీఎం … పీఎం విజిట్‌కు రావ‌డం లేద‌ని అంద‌రికీ తెలిసిపోయింది. ఇది చ‌ర్చ‌కు దారి తీసింది. స‌రే, ఇదంతా పాత ముచ్చ‌ట‌. కానీ తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న కొత్త ముచ్చ‌టేందో తెలుసా..? కీల‌క‌మైన ప్రొటోకాల్ లిస్టులో తీన్మార్ మ‌ల్ల‌న్న వ‌చ్చి చేర‌డంతోనే సీఎం కేసీఆర్‌కు తీవ్ర కోపాన్ని తెప్పించింద‌ని, అందుకే ఆయ‌న రాలేద‌ని. అవును.. ఇప్పుడు దీన్నే ప్ర‌ధానంగా చ‌ర్చించుకుంటున్నారంతా.

మొద‌ట పీఎం మోడీ స్వాగ‌త కార్య‌క్ర‌మానికి మంత్రి శ్రీ‌నివాస్ యాద‌వ్ పేరును ఖ‌రారు చేశారు. ఇది చ‌ర్చ‌కు దారి తీసింది. అంటే కేసీఆర్ రావ‌డం లేదా..? అనే అంతా చ‌ర్చించుకుంటున్న స‌మ‌యంలో … కేసీఆర్ వెళ్లాల‌నే ఆలోచ‌న చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి.ఆ ప్ర‌క‌ట‌న అధికారికంగా రిలీజ్ కాలేదు. కానీ ఆ లోపే కేసీఆర్ ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా ప్రొటోకాల్ లిస్టు తెప్పించుకున్నాడు. ఎవ‌రెవ‌రు ఈ కార్య‌క్ర‌మంలో ఉన్నార‌ని. ఆ లిస్టులో తీన్మార్ మ‌ల్లన్న పేరును చూసిన కేసీఆర్ భ‌గ్గుమ‌న్నాడు. ఇదేందీ..? కీల‌క‌మైన దీనికి తీన్మార్ మ‌ల‌న్న లాంటి క్యారెక్ట‌ర్ లెస్ గాడ్ని కూడా పిలుస్తారా..? అని వ్య‌క్తం చేసినట్టు పార్టీ వ‌ర్గాలు ప్ర‌చారం చేసుకుంటున్నాయి. వెంట‌నే దీనికి హాజ‌రు కావొద్ద‌ని డిసైడ్ అయ్యాడ‌ని తెలిసింది. ఆ త‌ర్వాతే ఆయ‌న‌కు జ్వ‌రం వ‌చ్చింద‌నే ప్ర‌క‌ట‌న విడుద‌లైంది

ఈట‌ల రాజేంద‌ర్ అంటే సీఎంకు కోపం త‌గ్గ‌లేదు. త‌గ్గ‌దు. ఈటల కూడా ఈ కార్య‌క్ర‌మంలో ఉండ‌టంతో పాటు తీన్మార్ మ‌ల్ల‌న్న లాంటి అర్హ‌త లేని, ఓ క్రిమిన‌ల్ కూడా దీనికి హాజ‌రు కావ‌డమా..? అని ఆయ‌న అన్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రెండు కార‌ణాలూ కేసీఆర్‌ను పీఎం కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌ర‌య్యేలా చేశార‌ని అనుకుంటున్నారు. ఈట‌ల‌ను ద‌గ్గ‌ర చూడ‌టం, క‌ల‌వ‌టం కూడా కేసీఆర్‌కు ఏ మాత్రం ఇష్టం లేని, స‌హించ‌ని ప‌ని…. ఇటు ఈట‌ల‌, అటు తీన్మార్ మ‌ల్ల‌న్న పేర్లు చూశాక‌…… కేసీఆర్ పీఎం ప్రోగ్రాంకు డుమ్మా కొట్ట‌డ‌మే బెట‌ర‌ని డిసైడ‌యిన‌ట్టు చ‌ర్చించుకుంటున్నారు.

You missed