వ‌న‌మా రాఘ‌వ వార్త న‌మ‌స్తే తెలంగాణ‌లో రాలేదు. రాదు.రావాల‌ని కోరుకోవ‌డం మూర్ఖ‌త్వం. ఆ ప‌త్రిక పాఠ‌కుల‌కుంటే ఆ యాజ‌మాన్యానికి, ఆ ఎడిట‌ర్‌కు అంత చిన్న‌చూపు. మేము రాసిందే వార్త‌. మేము చెప్పిందే నిజం. మా ప‌త్రిక‌లో వ‌చ్చినవి త‌ప్ప‌.. ప్ర‌పంచంలో మ‌రేం వింత‌లు, విశేషాలు, నేరాలు, ఘోరాలు లేవు.. అని భ‌రోసా ఇస్తూ విడుద‌ల‌య్యే ఏకైక ప్ర‌తిక న‌మ‌స్తే తెలంగాణ‌. టీరెఎస్ ఎమ్మెల్యే కొడుకు దారుణాలు బ‌య‌ట‌ప‌డితే అది వార్త కాదా.? వాడు టీఆరెస్‌కు చెందిన వాడైతే ఏ నేరం చేసినా.. మ‌న‌కు ప‌ట్ట‌దా..? రాయ‌డ‌మే రాజ్య‌ద్రోహ‌మా..? కేటీఆర్ వ‌ద్ద‌న్నాడా? కేసీఆర్ వ‌ద్ద‌న్నాడా? ఒక‌వేళ వార్త రాసి నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్టుగా నిరూపించుకుంటే.. ఉన్న ఉద్యోగం ఊడి .. నువ్వు పీకేసిన ఉద్యోగుల్లా బ‌తుకు రోడ్డున ప‌డుతుంద‌ని భ‌య‌మా… టీకే..?

చెప్పేవి శ్రీ‌రంగ నీతులు…. మ‌రి వార్త‌ల విష‌యంలో ఇలా ద్వంద్వ వైఖ‌రి ఎందుకో..? నువ్వు చెప్ప‌క‌పోతే.. నీ ప‌త్రిక‌లో అచ్చేయ‌క‌పోతే.. ప్ర‌పంచానికి తెలియ‌దా..? రాఘ‌వ ఎవ‌డో.. వాడేం చేశాడో జ‌నాల‌కు తెలియ‌దా..? నిప్పు కోడిలా నీ త‌ల‌ను ఇసుక మేట‌లో క‌ప్పేసి ఎవ‌రూ చూడటం లేదని భ్ర‌మిస్తున్నావా? లేక‌.. అలాంటి వార్త‌లు రాయ‌డానికి ఎవ‌డో కోన్ కిస్కాగాడు ఉంటాడు.. మ‌నం అలాంటి చిల్ల‌ర వార్త‌లు రాస్తామా..? అని ఊరుకున్నావా? లైట్ తీసుకున్నావా..?

 

You missed