ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా… పుష్ప‌లో ఐటెం సాంగ్ ఇది. స‌మంతా న‌టించింది. మ‌న మంగ్లీ చెల్లె ఇంద్రావ‌తి చౌహాన్ పాడింది. మాంచీ ట్రెండింగ్‌లో ఉందీ సాంగ్‌. కానీ ఏపీ పురుష సంఘానికి మాత్రం ఈ పాట న‌చ్చ‌లేదు. అందులో రాసిన ప్ర‌తీ లైనూ మ‌గ‌వాళ్ల‌ను .. చిత్త‌కార్తె కుక్క‌ల్లా వ‌ర్ణించిన తీరు అస్స‌లు నచ్చ‌లేదు. భ‌గ్గుమ‌న్నారు. ఏం చేయాలే అర్థం కాలేదు. ఎవ‌రిని కొట్టాలో ఎవ‌రిని తిట్టాలో అర్థం కాలేదు.. చివ‌ర‌కు ఏపీ హై కోర్టు ను ఆశ్ర‌యించారు. ఇద‌న్యాయం.. ఆపించండ‌ని.

లేక లేక స‌మంతా ఐటెం సాంగ్ చేసింది. అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు. పాట కూడా క్లిక్ అయ్యింది. మ‌ధ్య‌లో ఈ మ‌గ వెధ‌వలేకేమొచ్చిందీ అంటారా..? కోపం రాదాండి మ‌రి. ఆడోళ్లంటే అంత సొంగ‌కార్చుకునే వాళ్ల‌లాగా క‌న‌బుతున్నామా..? కాక‌పోతే ఐటెం సాంగ్స్ అంటే మాకూ ఇష్ట‌మే. ఎక్స్‌పోజింగ్ అంటే ప‌డి ఛ‌స్తామ‌నుకో.. సెల్‌ఫోన్ల‌లో బూతు బొమ్మ‌లు కూడా దొంగ‌త‌నాన చూస్త‌మ‌నుకో. రోడ్డున పోయే వారిని కామెంట్ చేయ‌కున్నా.. మ‌న‌సులో టీజింగ్ చేస్తామ‌నుకో. కానీ మ‌రీ ఇలా బ‌హిరంగ‌ప‌ర్చాలా ఈ పాట‌లో. ఇజ్జ‌త్ తీయాలా మా మ‌గ‌జాతిది.

ఈ పాట చూస్తే ఈ మ‌గ‌జాతి వ‌ల్లే రేపులు పెరుగుతున్నాయ‌ని స‌మాజం భ్ర‌మ‌ప‌డే ప్రమాదం ఉంది తెలుసా..? ఇప్పుడు టీన్యూస్‌లో ప‌నిచేస్తున్న ఇల‌పాములోరు గారు అప్పుడెప్పుడో సెల‌విచ్చిన‌ట్టు.. అస‌లు ఆడ‌ది ఒప్పుకోకుండా.. ఏ మ‌గ‌వెధ‌వ‌న్నా రేప్ చేస్తాడాండీ..? చెప్పండి. అస‌లు లోపమంతా ఆడ‌దాని ద‌గ్గ‌రే ఉంది. ఆడ‌దే ఈ సృష్టికి విల‌న్‌. మ‌గ‌జాతిని భ్ర‌ష్టు ప‌ట్టించే ఓ చీడ పురుగు..ఇంకా.. ఇంకా.. అస‌లు మాట‌లు రావ‌డం లేదు కానీ…. మ‌న ఇల‌పాములోరు గారిన‌డిగి మ‌రీ ఆడ‌వాళ్ల గురించి వివ‌రంగా చెప్తానుండండి….

You missed