ఇప్పుడంతా ఒమిక్రాన్ వేరియంట్ క‌రోనా గురించి జ‌నం వ‌ణుకుతున్నారు. అంత‌లా ప్ర‌చారం జ‌రుగుతోంది. చేస్తున్నారు ప‌నిగ‌ట్టుకుని. మెడిక‌ల్ మాఫియాను పెంచిపోషించేందుకు. బ‌తికించేందుకు. ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేసేందుకు. కొంద‌రు తెలియ‌ని భ‌యంతో. కొంద‌రు కావాల‌నే. మొత్తానికి ఇది జనాల మెద‌ళ్ల‌లోకి బాగా ఎక్కింది. ప్ర‌భుత్వం కూడా మాస్కులు కంప‌ల్స‌రీ, లేదంటే వెయ్యి జ‌రిమానా.. అని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కూడా జ‌నాల‌ను మ‌రింత భ‌య‌పెట్టించింది. ఇక ఇప్పుడు ముచ్చ‌ట లాక్‌డౌన్ మీద‌కు మ‌ళ్లింది. మహారాష్ట్ర‌లో పెట్టారంట క‌దా.. ఇక్క‌డ కూడా పెడ‌తారంట క‌దా.. మరి ప‌నులు సాగేదెలా..? క‌డుపు నిండేదెలా..? అప్పులు తీరేదెలా..? మ‌ళ్లీ స్కూళ్లు బందు పెడ‌తారా? మ‌రి పిల్ల‌ల చ‌దువులు సాగెదెలా..? విద్యా సంస్థ‌లు బందు పెడితే మా ఫీజుల వ‌సూలెలా..? ఇలా ఎంద‌రికో ఎన్నోన్నో స‌మ‌స్య‌లు.. అంద‌రికీ అనుమానాల భయాందోళ‌న‌లు. కానీ ఈ రోజు సాక్షిలో వ‌చ్చిన ఈ క‌థ‌నంలో ఎంతో ధైర్యాన్నిచ్చేలా ఉంది. అనుమానాల‌ను నివృత్తి చేసేలా ఉంది. భ‌యాల‌ను పార‌దోలేలా ఉంది. అన‌వ‌స‌ర ప్ర‌చారాల‌కు చెక్ పెట్టేదిగా ఉంది. ఏఐజీ ఆస్ప‌త్రుల చైర్మ‌న్ డాక్ట‌ర్ డీ నాగేశ్వ‌ర్‌రెడ్డి చెప్పిన ఆ మాట‌ల సారాంశాలు.. ఇవీ…

– ఈ వేరియంట్ ప్రత్యేక‌మైన ట్రీట్‌మెంట్ అవ‌స‌రం లేదు. క‌రోనాకు ఇచ్చే ట్రీట్‌మెంట్ స‌రిపోతుంది.

– వెంటిలేట‌ర్ పెట్టాల్సిన ప‌రిస్థితులు లేవు. కొన్ని సంద‌ర్భాల్లో అస‌లు ఎలాంటి చికిత్స‌లు కూడా అవ‌స‌రం ప‌డ‌క‌పోవచ్చు.

– సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు మాదిరిగా రెండు మూడు రోజుల్లోనే త‌గ్గే అవ‌కాశాలున్నాయి.

-బూస్ట‌ర్ డోస్‌లు అవ‌స‌ర‌మే. దీని వ‌ల్ల ర‌క్ష‌ణ పెరిగి ఒమిక్రాన్ ప్ర‌భావం పెద్ద‌గా ప‌డ‌కుండా ఉండేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

– రెండు డోసులు తీసుకున్న వారికి బూస్ట‌ర్ వ్యాక్సిన్లు వేసుకునేందుకు అనుమ‌తివ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాం. దీనిపై ఇంకా ప్ర‌భుత్వం ఎందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదో అర్థం కావ‌డం లేదు.

You missed