మీడియా మీడియాలాగే ఉండాలె. కానీ ఉండ‌దు. ఆ పార్టీ జెండా కింద ప‌నిచేసే మీడియా దాని బాగు కోరుకుంట‌ది. అంతే అది గెల‌వాల‌ని కోరుకుంట‌ది. అందుకే అది మీడియా కాదు. ఆ యాంక‌ర్ జ‌ర్న‌లిస్టూ కాదు.టీ న్యూస్ ప‌రిస్థితి ఇదే. మూడు రౌండ్ల‌లో బీజేపీ ఆధిక్యం ఉన్నా.. పైనే టీఆరెస్ ఓటింగ్ వేసుకుంటున్నారు. రెండో స్థానానికి బీజేపీ ఓట్లు వేసుకుని అలా ఆనందం పొందారు.

మ‌రి వాళ్ల ఛాన‌ల్ వాళ్ల ఇష్టం. కేసీఆర్ కు ఏమైనా చిర్రెత్తుకొచ్చిందో .. వీరంతా రోడ్ల మీద‌కు వ‌స్తారు. ఆ భ‌యం ఉంటుంది. అందుకే చివరి వ‌ర‌కు వీరి పంథా.. కింద ప‌డ్డా మాదే పై చేయి అన్న‌ట్టుగా ఆనందం పొందుతారు. టీఆరెస్ అభిమానుల‌కు ఈ ఛాన‌ల్ ఊర‌ట‌నిస్త‌ది. గెలిచే ఛాన్స్ ఉంద‌ని చివ‌రి వ‌ర‌కు ఆశ‌లు రేపుత‌ది. కాబ‌ట్టి బీపీలు పెర‌గ‌వు. హాయిగా చూసుకోవ‌చ్చు. విశ్లేష‌కులు కూడా చాలా బాగా మాట్లాడ‌తారు. ఆ యాంక‌ర్ ముఖ‌మే చూడ‌లేక‌పోతున్నాం బాస్‌. ఆముదం తాగిన‌ట్టు పెట్టాడు. ఇక ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసిపోయిందో.. ఆ మూడు రౌండ్ల‌కే ఇలా ఉంటే… చివ‌రి వ‌ర‌కు ఎలా నెట్టుకొచ్చేది.. అని అనుకున్నాడో తెలియ‌దు కానీ, ఏడ్పు ముఖం పెట్టుకున్నాడు.

క్రిషాంక్‌, వీ ప్ర‌కాశ్ విళ్లేష‌కులు. అర్బ‌న్ ఓట్లే క‌దా.. డోంట్ వర్రీ.. రూర‌ల్‌లో మ‌న‌మే అన్నాడు ప్ర‌కాశ్‌. గెల్లు శ్రీ‌నివాస్ క్యాండెట్ క‌రెక్టు కాద‌నే విష‌యాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఇంతే క‌దా లీడ్‌.. ఏం కాద‌న్నాడు క్రిషాంక్‌. కానీ ఇంత ఖ‌ర్చు పెట్టీ.. ఇంత చేసీ.. ఇంత కాపు కాసీ.. ఇంత హోరా హోరీ ఎలాల సాధ్య‌మ‌య్యిందంటారు.. టీ న్యూస్ అండ్ కంపెనీ. అదీ కూడా విళ్లేషించండి…

You missed