హ‌రీశ్‌రావు ఏడుంటే ఆడ అదో హంగామా. అదో ఉత్సాహం. ఆయ‌న మాట‌లు సేమ్ కేసీఆర్ లెక్క‌నే ఎంత విన్నా వినాల‌పిస్తుంది. హుజురాబాద్ ప్ర‌జ‌లు కూడా హ‌రీశ్ ఏం చెప్పినా కేసీఆర్ చెప్పిన‌ట్టే భావించారు. శ్ర‌ద్ద‌గా విన్నారు.హామీల వ‌ర‌ద‌లో మునిగిపోయారు. అక్క‌డ అంతా క‌ల‌ర్ ఫుల్ నిన్న‌టి వ‌ర‌కు. కానీ ఇప్పుడు హుజురాబాద్ బోసి పోసింది. క‌ల‌ర్ ఫుల్ కాస్త క‌ల‌ర్ వెలిసిపోయి వెల‌వెల‌బోయింది.

మాట‌లు చెప్పేవాళ్లు లేరు. ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవాళ్లూ లేరు. తిన్నావా అని అడిగిటోళ్లు లేరు.. క‌నీసం మందు చుక్కైతో గొంతైనా త‌డుపుకున్నావా అని అడిగిన పాపాన పోవ‌డం లేదు ఎవ‌రూ. కానీ మొన్న‌టి వర‌కు అనాథైన సిద్దిపేట ఇప్పుడు ఒక్క‌సారిగా కోలుకున్న‌ది. హ‌రీశ్ లేక చిన్న‌బోయి కూర్చన్న సిద్దిపేట ఇప్పుడు హుషారుగున్న‌ది. హ‌రీశ్ వ‌చ్చిండు మ‌ళ్లీ. అబ్బా..! ఎన్ని నెల‌లైంది. ఇన్ని రోజులు వ‌దిలివెళ్లినందుకు సిద్దిపేట ఎంత చిన్న‌బోయిందో క‌దా. సిద్దిపేట‌లో హ‌రీశ్ ఏది చెబితే అది. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తాడు. అనుకున్న‌ది చేసిపెడ‌తారు. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో క‌లియ‌తిరిగి తెలుసుకుంటాడు. ప్ర‌జ‌ల్లోనే ఉండి వాటిని ప‌రిష్క‌రిస్తాడు. ఇది నిత్యం జ‌రిగే తంతు.

కానీ కొన్ని నెల‌లుగా సిద్దిపేట‌లో చెప్పేవాళ్లు లేక‌.. ప‌నులు చేపించేవాళ్లు లేక పాపం.. దిగాలుగా, ఒంట‌రిగా, దీనంగా చూస్తుండి పోయింది. ఇప్పుడు మ‌ళ్లీ హారీశ‌న్న వ‌చ్చిండు. మ‌ళ్లా అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నాడు. పెండింగ్ ప‌నులు చకాచ‌కా చేయిస్తున్నాడు. ప్ర‌జ‌ల ఇబ్బందులు వెనువెంట‌నే తీర్చేందుకు ఆదేశాల మీద ఆదేశాలు జారీ చేస్తున్నాడు. మ‌ళ్లీ చూడ ముచ్చ‌ట‌గా ఉంది సిద్ద‌పేట‌. ఇప్పుడు హుజురాబాద్ ఉసూరుమంటోంది. ఏదో ఎన్నిక‌లో గెల‌వాల‌నే ఏవేవో త‌న ప‌రిధిని దాటి సీఎం స్థాయిలో హ‌రీశ్ హామీలిచ్చి అవ‌త‌లిగ‌డ్డ ఎక్కాడు.మ‌ళ్లా త‌న సొంత గూటికి చేరి ఇంటిని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ప‌డ్డాడు.

ఇప్పుడు హుజురాబాద్‌ను ప‌ట్టించుకునేవారేరీ..? టీఆరెస్ గెలిచినా.. ఇచ్చిన అల‌విమాలిన హామీల‌న్నీ నెర‌వేర్చ‌డం సాధ్యం కాదు. ఆర్థిక శాఖ మంత్రిగా అవ‌న్నీ కావ‌ని తెల‌సినా.. ఎడాపెడా పెడాఎడా హామీల మీద హామీలు గుప్పించి అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి ఓట్ల పండుగ అయిపోగానే సిద్దిపేట జారుకున్నాడు హ‌రీశ్‌. ఒక‌వేళ హుజురాబాద్ ప్ర‌జ‌ల క‌ర్మ‌కాలి బీజేపీయే గెలిచింద‌నుకో… అటువైపు చూసే దిక్కుండ‌దు. ఓ కామెంట్‌.. ఓ స్పంద‌న విడుద‌ల చేసి మీ చావు మీరు చావండి ఈట‌ల‌తోనే అన్నీ చేయించ‌కోండి.. మా జోలికి రాకండ‌నే విధంగానే ఉంటుంది వ్య‌వ‌హారం.

You missed