పునీత్ రాజ్‌కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం పొందిన త‌ర్వాత కానీ స‌మాజానికి తెలియ‌రాలేదు అత‌ను చేసిన సేవ‌లు. త‌న మ‌న‌సుకు న‌చ్చింది చేయాల‌నుకున్నాడు. చేశాడు. ప్ర‌చారం కోరుకోలేదు. ఎవ‌రి మెప్పుకోస‌మో చేయ‌లేదు. అందుకే అత‌ని సేవ‌లు ఆల‌స్యంగా తెలిశాయి స‌మాజానికి. అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌న వాళ్ల‌తో పోల్చి చూసుకోవ‌డం ప్రారంభించారు. స‌హ‌జ‌మే క‌దా. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఇంత చేశాడు క‌దా..! మ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశాడు..? ఇప్పుడివే పోస్టులు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఏదో ఒక‌ స్టార్ అని పెట్టుకున్నంత మాత్రాన ఇలా సేవ‌లు చేయాల‌ని ఏమ‌న్నా ఉందా? అయినా ప‌వ‌ర్ స్టార్ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకుని ఏదో చేద్దామ‌ని తిరుగుతున్నాడు క‌దా. సినిమాలు వ‌దులుకుని. అలా మ‌నం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని స‌రిపెట్టుకోవాలి. పెద్ద పెద్ద స్టార్లే ఏమి చేయ‌లేక‌.. ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకొని, కులం రొచ్చులో బొర్లాడుతూ.. పెత్త‌నం కోసం పెంట పెంట చేసుకుంటూ.. వేదిక‌ల మీద బ‌ట్ట‌లిప్పేసుకుని ఒక‌రి గురించి ఒక‌రు తిట్టిపోసుకుంటూ.. నేను గొప్పంటే.. నాఫ్యామిలీ గొప్ప‌ని, మా వంశం గొప్ప‌ని కీర్త‌ల‌ను అందుకంటూ.. అదే భావ‌జాలాన్ని అభిమానుల‌కు రుద్ది.. అందులో కొట్టుకు చ‌చ్చిపోండ‌ని పిలుపునిస్తూ ఉంటారు. అలాంటి మ‌న‌తో వాళ్ల‌కు పోలికేంటీ బ్ర‌ద‌ర్? ప‌ని పాట లేనివాళ్లంతా ఇలా పోలిక‌లు పెట్టి మ‌నల్ని మ‌నం చిన్న‌బుచ్చుకుంటూ.. అవ‌హేళ‌న చేసుకుంటూ ఉంటాం. ప‌క్కోడి ముందు మ‌రీ దిగ‌జారేలా చేసుకుంటూ ఉంటాం. ఇది బాగ‌లేదు.

విశాల్ మ‌న‌వాడే. కానీ మ‌న గ్యాంగ్‌లో లేడు సంతోషం. పునీత్ 1800 మంది అనాథ‌ల‌కు ఉచిత విద్య‌తో పాటు అన్నీ తానై చూసుకున్నాడు మొన్న‌టి వ‌ర‌కు. ఇప్పుడు అత‌ను లేడు. ఆ అనాథ‌ల బాధ్య‌త నాదీ అని ముందుకు వ‌చ్చాడు మ‌న విశాల్‌. ఇలా చేయలంటే విశాల హృద‌యం కావాలి బాస్‌. విశాల్ లాంటి హృదయం మ‌న‌వాళ్ల‌కూ రావాలి బాస్‌..!! వ‌స్తుంద‌ని అనుకుందాం. ఆశ‌ప‌డ‌టంలో త‌ప్పులేదు. అది అత్యాశే అని తెలిసినా.

https://fb.watch/8_YXA8koSU/

You missed