హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వారే విజేత‌లు. ఈ ఓట్లే అభ్య‌ర్థి గెలుపుకు, మెజార్టీకి కీల‌కంగా మార‌నున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌భావం కూడా ఈ ఓట్ల పై ఉండ‌నుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్ల‌ను లాక్కుంటుందా..? ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త బ‌లంగా ప‌నిచేసి అవి ఈట‌ల ఖాతాలో చేరుతాయా? అనేదే తేలాల్సి ఉంది.

టీఆరెస్‌కు ఓటు బ్యాంకు 40శాతంగా ఉంది.ఈ ఓటు బ్యాంకు చెక్కు చెద‌ర‌కుండా ప‌దిలంగా ఉంది. పింఛ‌న్లు, రైతుబంధు, ద‌ళిత‌బంధు త‌దిత‌ర ప‌థ‌కాల‌తో పాటు టీఆరెస్ చెక్కు చెద‌ర‌ని ఓటు బ్యాంకు దాదాపు 40 శాతం ఉంది. బీజేపీకి క్యాడ‌ర్ లేదు. ఓటు బ్యాంకూ లేదు. కానీ ఈట‌ల వ్య‌క్తిగ‌తంగా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాడు. అత‌న్ని చూసే ఓట్లు వేసేందుకు సిద్ద‌మ‌య్యారు త‌ప్పితే.. బీజేపీని చూసి కాదు. అలాంటి ఓట్లు ఇక్క‌డ 30 శాతం వ‌ర‌కూ ఉన్నాయి. కాంగ్రెస్‌కు మ‌రో 10 శాతం మేర చెక్కు చెద‌ర‌ని ఓటు బ్యాంకు ఉంది.

ఈ 80 శాతం పోను… మ‌రో 20 శాతం ఓట్లు త‌ట‌స్థంగా ఉన్నాయి. ఇందులో ప‌దిశాతం ఆ రోజ వ‌ర‌కు ఎవ‌రికి వెయ్యాలో తేల్చుకునే బాప‌తు.. అప్ప‌టిక‌ప్పుడు తేల్చుకునే టైపు.. మ‌రో ప‌దిశాతం చివ‌ర‌గా పోల్ మేనేజ్‌మెంట్‌కు త‌గ్గ‌ట్టుగా నిర్ణ‌యాలు తీసుకునే వారున్నారు. వీరిని టీఆరెస్ త‌న ఖాతాలో వేసుకుంటుంది. ఈ త‌ట‌స్థ 20శాతం ఓట్ల‌తోనే టీఆరెస్‌, బీజేపీ అభ్య‌ర్థుల జాత‌కాలు తేల‌నున్నాయి. అంతిమంగా మెజారిటీ మాత్రం ఎవ‌రికీ పెద్ద‌గా దక్కే అవ‌కాశాలు లేన‌ట్టు కనిపిస్తున్నాయి. బొటాబొటీ మెజారిటీ విజ‌యం వ‌రించ‌నుంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ పోటీ ఉంది. మొద‌టి నుంచి అదే దోర‌ణి, అదే ట్రెండ్ కొన‌సాగుతున్న‌ది.

 

You missed