హుజూరాబాద్‌లో పంప‌కాలు మొద‌ల‌య్యాయి. ఓటుకింత‌.. అని రేట్ ఫిక్స్ అయిపోయింది. ఎవ‌రికి ఎక్క‌డ ముట్ట‌జెప్పాలో అట్ల అందుతున్నాయి. 30న ఎన్నిక‌లుంటే.. ఇ ట్ల ప్ర‌చారం బంద్ అయిందో లేదో.. అప్పుడే డ‌బ్బులు పంచుడు షురూ అయ్యింద‌ట‌. ఇలా మొద‌లు పెట్టిండ్రో లేదో.. అప్ప‌డే లొల్లి కూడా షురూ అయ్యింద‌ట‌. ఓటుకు ప‌దివేలు ఇవ్వ‌మ‌ని ఇస్తే.. మ‌ధ్య‌లున్నోళ్లు.. ఆరు వేలే ఇస్తున్న‌ర‌ని లొల్లి చేస్త‌న్న‌రంట‌.

క‌వ‌ర్ మీద ఒక‌టో నెంబ‌ర్ ఉంటే ఆరు వేలు.. రెండో నెంబ‌ర్ ఉంటే ప‌న్నెండు వేలు అని ముట్ట‌జెప్తున్నార‌ట‌. ఇచ్చిందైతే తీసుకుంటున్నారు. కానీ ఈ ఆరువేలు.. ప‌న్నెండు వేలేంది..? ప‌దివేలు.. ఇర‌వై వేలు క‌దా.. అని నిల‌దీస్తున్నారంట ఓట‌ర్లు. ఇగో అప్పుడే ఇట్ల లొల్లి షురూ అయ్యింది. మొన్న‌టిదాక‌నైతే.. ఓటుకు 20వేలు ఇచ్చేందుకు రెడీ చేసుకున్న‌ర‌ని మ‌స్తు ప్ర‌చారం చేసిండ్రు. ఇంకేముంది..? మా ఇంట్లో ఎన్ని ఓట్లున్న‌య్‌..? ఎన్ని పైస‌లొస్త‌యి అని లెక్క‌లేసుకుని… ఆ వ‌చ్చిన పైస‌ల‌తోని ఏమేమి చెయ్యాలె..? ఏమేమి కొనాలె..? అని ముందుగానే ప్లాన్ కూడా చేసి పెట్టుకుండ్రంట‌.

ఇప్పుడేమో ఆరువేల‌కే కుదించి ఇస్తే.. పేదోడి బ‌డ్జెట్ త‌ల్ల‌కిందులు కాదా..? పెద్ద‌లు అర్ధం చేసుకుని దీన్ని స‌రిదిద్దాలె. ఏదైతే ముందుగాళ్ల అనుకున్నారో… ఓటుకు 20వేలు అని వాటినే క‌రెక్టుగా క‌వ‌ర్లో పెట్టి పంచాలె. ఇద‌న్యాయం.. ఇప్ప‌టి దాకా ఇంత ఖ‌ర్చు పెట్టి.. ఇప్పుడు గీడ‌నే కొసురుత‌ర‌. మ‌ధ్య‌లో ఉన్నోళ్ల‌ను న‌మ్మ‌కుండ్రి.. స‌గం వాళ్లు తీసుకుని మిమ్ముల న‌ట్టేట ముంచ‌త‌రు. ఆ త‌ర్వాత అడిగితే మాకైతే తెల్వ‌దు..

You missed