ఈ దేశంలో స్త్రీలు నెలసరి మొదలైయ్యాక గుడిలోకి శుభకార్యాలకి రాకూడద‌ని, ఎవరిని ఏ వస్తువుని తాకకూడదు, కొందరు సొంత ఇంట్లోకి రానివ్వకుండా మూల కూర్చోబెడతారు. కొన్ని చోట్ల మొక్కలకి నీళ్లు కూడా పోయ్యానివ్వ‌రు. హాస్పిటల్స్ లోనో, ఇంట్లోనో బిడ్డను కంటే పలకరింపుకి వెళ్ళేవాళ్ళు తిరిగొచ్చి స్నానం చేయకుండా తమ ఇళ్లలోకి వెళ్లరు కొన్ని చోట్ల!

కొన్ని ధర్మరక్షక సంస్థలు కోర్టుకి కూడా వెళతాయి. మైల పడ్డ మహిళలపై గెలుపు కోసం !!
దేవుడు వీళ్ళ దృష్టిలో సర్వాంతర్యామి కానీ ఏ మైలా వీళ్ళు తినే ఆహారం పండించే పొలాల్లో పని చేయటానికి, ఆటల్లో మెడల్స్ తేవటానికి, ఆకాశంలో ఎగరడానికి, అంతరిక్షంలో అడుగుపెట్టడానికి అడ్డం కాదు.

దేవుడు అక్కడ లేడు కాబట్టి మహిళలు అక్కడ అడుగుపెట్టగలుగుతున్నారు. అంటారా.. ఒప్పుకుంటారా మరి. సాటి మహిళలు కూడా ఈ మైల అనే పేరుతో వివక్షలో కూరుకుపోయి ఉండటం బాధాకరం.
దేవుడిచ్చిన ‘బిడ్డ ద్వారం’ మైల ఎలా అవుతుంది అనుకోరు.

మైలపడ్డ మెదళ్ళు ఉన్న మనుషులు మైలలో 9 నెలలు ప్రాణం పోసుకుని సిగ్గులేకుండా పుట్టి బ్రతికేస్తూ … ఇంకోసారి మహిళల నెలసరిని గౌరవించలేదో దవడ పగులుద్ది … మూల కూర్చోబెట్టి గౌరవిస్తున్నాం అని సన్నాయి నొక్కులు ఆపు సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో… పిరియడ్ గురిబీచి ఆరోగ్య సూత్రాలు చెప్పాలి తప్ప అంటరాని సూత్రాలు వల్లించకూడదు..

Sashaguna Anga

You missed