వినాయకుడి విగ్రహం పాలు తాగింది… సాయి బాబా విగ్రహం నుంచి విభూది వస్తుంది , కొన్ని విగ్రహాలు కళ్ళు తెరచాయి అన్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం..
వీటిని దేవుడి మీద నమ్మకం ఉన్నవారు దేవుళ్ళ మహిమ అంటూ కీర్తిస్తారు. దేవుడు లేరు అనే హేతువాదులు ఇదంతా భ్రమ అటువంటిది ఏమీ లేదు అని కొట్టివేస్తారు..

ఎవరు ఎన్ని చెప్పినా దేవుళ్లను నమ్మేవారు వారి మహిమలు అంటూ జరుగుతున్న వింతలను నమ్ముతూనే ఉంటారు. ముఖ్యంగా షిర్డీ సాయిబాబా విగ్రహం లేదా పటం నుంచి విబూది రాలుతుంది అని సాయి భక్తులు తరచుగా చెబుతూనే ఉన్నారు.

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి హిమ ఇంట్లో కూడా ఓ అద్భుతం చోటు చేసుకుంది.. ఈ విషయాన్నీ హిమజ స్వయంగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.

తన ఇంట్లో ఉన్న ఒక సాయి బాబా విగ్రహం నుంచి విబూది రాలుతుందని బాబా విగ్రహం ముందు ఉన్న నీళ్లలో తులసి వాసన వస్తుందని స్వయంగా హిమజ చెప్పింది. ఆ విగ్రహం ఎప్పటి నుంచో తమ ఇంట్లో ఉందని.. ఇంటర్ చదువుతున్న సమయం నుంచి సాయిబాబా విగ్రహం తమ ఇంట్లో ఉందని 2004లో రమణానంద స్వామీజీ పరిచయం అయ్యారు.

అప్పుడు ఆయన బాబాకి 19 రోజులు హోమం కూడా చేశాం. ఇక అప్పటి నుండి రోజు సాయిబాబా విగ్రహం తుడవడం, ముందున్న నీళ్ళని మార్చటం, పూజలు చేయటం నా డ్యూటీ అయిపోయింది.

అయితే ఇప్పుడు సాయిబాబా విగ్రహం క్లిన్త చేయడానికి వెళ్ళినప్పుడు సాయిబాబా విగ్రహం చుట్టూ విబూది ఉంది. తన ఇంట్లో జరిగిన అద్భుతాన్ని అందరికి చెబుతూ.. సాయి బాబా భక్తుల కోసం వీడియో కూడా చేసింది హిమజ. అప్పుడు తాము సాయి భజన పెట్టుకున్నామని.. ఇది ఎవరు నమ్మరని.. జీవితంలో అనుభవంలోకి వస్తేనే తెలుస్తుందని తానూ ఎవ్వర్నీ నమ్మించడానికి ఈ విషయం చెప్పటం లేదని, తన అనుభూతిని చెప్పుకోడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానని హిమజ క్లారిటీ ఇచ్చింది హిమజ.

బుల్లి తెరపై కొన్ని సీరియల్స్ లో నటించిన హిమజ. బిగ్ బాస్ హౌస్ సీజన్ లో హౌస్ లోకి అడుగు పెట్టిన హిమజ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

# ప్రతి మనిషి సైంటిఫిక్ టెంపర్ అలవర్చుకోవాలి #

chelimala rajeshwar

jana vignana vedika

You missed