వంట నూనె విషయంలో…‌ గానుగ ఆడించిన నూనె కంటే Refined Oil ఏ చాలా మంచిదని అంటున్నారు. అది నిజమేనా ?
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
మరి కొందరేమో, “వేరు శెనగల Rates ను Example గా తీసుకుని, కిలో వేరు శనగల Rate 120/- రూపాయలు ఉంటే.. మనకి One Litre నూనె కూడా అదే Rate కి Sale చేయడం ఎలా Possible అవుతుంది”, అని అంటున్నారు. So, Refined Oil ను కొని, ఆ పేరుతో మనం కల్తీ నూనె లను తింటున్నామా అని నాకు డౌట్ వస్తుంది. అసలు Refined Oil నే వాడుమని చెప్పడం వెనుక ఇంకా ఏదైనా Scientific Reason ఉంటే చెప్పండి ?
— Rajyalakshmi Beeram
—————————————————-
జవాబు:
Crude Pressed Oil (గానుగ నూనె) లో ఉన్న ఇబ్బందులు:-

గింజల క్వాలిటీ లో తేడాల వలన వచ్చే నూనె క్వాలిటీ లో తేడాలు, వాసనలు, మకిలి, వంటివి ఉంటాయి.

ఈ నూనెలు ఎక్కువకాలం నిలువ ఉండవు – నిలువ ఉంచిన నూనె లు మరింత వాసన కొట్టడం జరుగుతుంది. ఎక్కువ వేడి చేసినపుడు ఈ నూనెల లోని కొన్ని పదార్థాల వలన హాని కారక పదార్థాలు ఏర్పడటం కూడా జరుగుతుంది.

ఇక నూనెలను Refining చేసే Process లో మకిలి వాసన కలిగించే పదార్థాలను తొలగించటం జరుగుతుంది. అలాగే హానికరమయిన Fatty alAcids ను కూడా నూనెలోంచి తొలగించటం జరుగుతుంది.

ఇలా చేయటం ద్వారా ఈ Refined నూనె లు వాసన లేకుండా, నిలువ చేసినా చెడిపోకుండా, వేడి చేసినా క్వాలిటీ మారకుండా ఉంటాయి.

ఇదీ నూనె లను Refine చేసి వాడటం వెనుక ఉన్న అసలు కారణం.

అయితే, ఈ ప్రాసెస్ లో కొన్ని మంచి పదార్థాలు కూడా తొలగించ బడుతున్నాయి., ప్రాసెస్ చేయటం లో జరిగే లోపాల వలన ఇలా జరుగుతుందని గమనించారు. ఈ లోపాలను అధిగమించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక ధర విషయానికి వస్తే, మనము వేరుశెనగలను రిటైల్ గా అంగడి లో కొంటాము. అందుకే మనకు Rate ఎక్కువ పడుతుంది. కంపెనీల వారు, మన లాగా రిటైల్ అంగల్ల లో కొనరు. వారు నేరుగా రైతుల నుంచే కొంటారు. అంగడి లో వేరుశనగలు, కిలో 120/- రూపాయలకు దొరికితే, టోకు లో.. రైతులు వద్ద కలో 40 – 45 రూపాయలకే దొరుకుతుంది. కనుక వారికి నూనె 120 అమ్మటం లో నష్టమేమీ రాదు.

అంతే కాదు. నూనె ను Refine చేసినపుడు కేవలము నూనె నే కాదు, ఎన్నో రకాలయిన Byproducts కూడా వస్తాయి. వాటిని సబ్బులు, cహCosmetics, పశువుల ఆహారం, Fatty Acids తయారు చేసే కంపెనీలకు అమ్ముకుంటారు. కనుక ఇతర ఆదాయం కూడా ఉండటం వలన, నూనె తీయటానికి అయే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.

పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద రిఫైనరి లను పెట్టుకుని ప్రతీ రోజు కు టన్నుల కొదతది నూనె ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేయటం వలన తక్కువ ధర కు అమ్మటం వీలౌతుంది. కాబట్టి తక్కువ ధరలో Refined Oil అమ్మడం కష్టమేమీ కాదు.

ఉదాహరణకు, Fortune Brand వారు, ఒక రోజులో సుమారు 5000 టన్నుల పైగా నూనె ను తయారు చేస్తుంటే, ధరను అదుపులో పెట్టటం చాలా సులభం.

ఒకవేళ వేరుశెనగ మనదేశం లో ఎక్కువ రేటుకు దొరికే పరిస్థితి ఉంటే.. పెద్ద, కంపెనీలో వారు, ధరలు తక్కువగా పలికే బయటి దేశాల నుంచి వేరుశనగ,ను తెప్పించుకుంటారు.
— Bala Nayuni

(This is copied from:
Rajyalakshmi Beeram garu’s fb wall..)
— Rajeshwer Chelimela , Jvv Telangana

You missed