ఔను పాలూ, నీళ్ళూ (పక్షులూ, క్షీరదాల లాగా) తాగవన్నది, తాగలేవన్నది నిజమే, అందులో ఏ అనుమానాలు అక్కరలేదు..

పాములు మనలాగా లేదా ఇతర జంతువుల లాగా… నీటిని లేదా పాలను పీల్చుకుని తాగలేవు. ఎందుకంటే వాటి నాలుక, పెదవులు మరియూ వాటి ద‌వ‌డ‌ కండరాల నిర్మాణం ద్రవ పదార్థాలను పీల్చుకోవడానికి సహకరించవు..

కనీసం పక్షులైనా వాటికి తమకు దప్పిక వేసినపుడు, కొద్దిపాటి నీటి చుక్కలను, తమ ముక్కతో ఒడిసి పట్టుకొని (తమ) మెడను పైకెత్తి., ఆ నీటిచుక్కలు (తమ) గొంతు లోపలికంటా జారేలా చేసుకుంటాయి. కానీ పాములకు తమ మెడను కదిలించి వాటి తలను పైకెత్తే సౌకర్యం కూడా ఉండదు..

పాలూ, నీరూ, ఇతర ద్రవ పదార్థాలు “తాగడం” అనే ప్రక్రియలో.. నాలుక, పెదవులు మరియూ దవడ కండరాల కదలికల సహాయంతో.. ఆయా ద్రవ పదార్థాలను పీల్చుకోవడం అనేది జరుగుతుంది..

అయితే.. అలా నాలుక, పెదవులు మరియూ దవడ కండరాల కదలికల సహాయంతో ద్రవ పదార్థాలను పీల్చుకోవడానికి ప్రాకెడు జంతువులకు (రిప్టైల్స్ కు) లేదా ఉభయచరాలకు కుదిరే పనికాదు. అలాంటి మెకానిజాన్ని మనం కేవలం క్షీరదాల లోనే చూడగలం..

పక్షులలో కూడా (అంటే.. ఒక్క నిప్పు కోడిలో తప్ప) మిగిలిన మొత్తం పక్షి జాతులలో, అలాగే ప్రాకెడు జంతువులలో మూత్రాశయ నిర్మాణం కూడా ఉండదు. వాటిల్లో “యూరిన్”, “యూరిక్ ఆసిడ్”గా మారి “ఆనస్” ద్వారా.. మలంతో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. అంటే క్షీరదాలు తో పోలిస్తే మిగిలిన జంతువులకు నీటి అవసరం కూ చాలా తక్కువగా ఉంటుందని అర్థం.

అలా అవసరమైన, ఆ కొద్దిపాటి నీటిని Reptiles, ముఖ్యంగా పాములు (కింద క్లిప్పింగ్ లో చెప్పినట్టు), ఇతర మార్గాల గుండా గ్రహించి, తమ దేహం డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకుంటాయన్న మాట..

అయినా.. పాములన్నీ మాంసాహార జంతువులే.. వాటికి అవసరమైనంత నీరు, వాటి ఆహారం ద్వారానే లభిస్తుంది, ఇంకా ఏమైనా నీరు అవసరమైతే, అవి ఆ కొద్దిపాటి నీటిని ఇతర పద్దతులలో గ్రహిస్తాయి..

కింది క్లిప్పింగ్ లోని వార్త, “బొవా” (డబుల్ హెడెడ్ స్నేక్) జాతికి చెందిన పాము తనకు అవసరమైన నీటిని, తన చర్మం సహాయంతో తీసుకొనే పద్ధతిని తెలుపుతుంది. పైగా ఆ పద్దతి అన్ని జాతుల పాములకు కూడా వర్తించదనేది, ఆ వార్త సారాంశం..

Rajeshwer Chelimela , Jvv Telangana

You missed