కొంత మంది హిందూ మత పరిరక్షకులు నా FB లో యాడ్ అయిపోయారు.వాళ్లలో ఎక్కువ శాతం రిటైర్డ్ ఉద్యోగులు లేదా నలభై సంవత్సరాల లోపు యువకులు.వీళ్లలో 50 శాతం బ్రాహ్మణులు, 30 శాతం ఇతర అగ్ర కులాల వారు , ఓ 20 శాతం బీసీ లని చెప్పబడుతూ ఆర్ధికంగా బలంగానే ఉన్న ఓ నాలుగయిదు కులాలకు చెందిన వారు. వారి వారి కులాలు నీకు ఎలా తెలిసినియ్యని అడక్కండి, పేరుకు మొదట , చివర చూస్తే చాలదా సాటి హిందువునైన నాకు ఆ విషయం చాలా ఈజీగా తెలియటానికి.

వీళ్లలో రిటైర్ అయిన వాళ్లంతా ప్రభుత్వోద్యోగం నుండి రిటైర్ అయ్యి , పెన్షన్లు , గ్రాట్యుటీ లు అందుకుంటూ లేదా ఏకమొత్తంగా అందుకొని , వారి పిల్లలంతా దేశ విదేశాలలో స్థిరపడిపోగా వీరిక్కడ తమ కడుపులో చల్ల కదల కుండా బ్రతుకుతున్న వాళ్లే.ఇక నలభై ఏళ్ల లోపు బ్యాచ్ వారేమో కష్టమన్నది తెలియకుండా ఏదో ఒక కార్పొరేట్ స్కూల్ లో చదివి,తరువాత దేశ విదేశాలలో విస్తారంగా దొరుకుతున్న‌ ఇంజినీరింగ్ సీట్లలో ఒకటి సంపాదించి చదివేసి,తరువాత తమకున్న పీఆర్ తో ఏదో ఒక ఉద్యోగం లో చేరో లేదా తల్లి తండ్రులు తేరగా సంపాదించిన డబ్బుతో వ్యాపారం పెట్టో చేతిలో నాలుగు డబ్బులు ఆడుతుంటే, తిన్నది అరక్క టైం పాస్ కి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా చేసి మరీ విజ్ఞానం సంపాదించినోళ్లు.

వీళ్లలో చాలామందికి ….  వీళ్ళ ముత్తాత ఏ ఊరిలో పుట్టాడో తెలియదు కానీ , రాముడు ఎక్కడ పుట్టాడో మాత్రం తెలుసు.

వీళ్ళ ముత్తాతకి సైకిల్ కూడా లేకపోయినా వీళ్ళు కార్లలో తిరగటానికి కారణం కేవలం ఆ భగవదానుగ్రహమే అనుకుంటారు. పక్క కులం దాకా ఎందుకు ఖర్మ , తమ కులంలోనే తమకు తూగే వారితో తప్ప మిగిలిన వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ పెంచుకోరు. అందుకే సెక్యూలర్ అనే పదం వీరికి ఒక బూతు పదంలా వినిపిస్తుంది.వీరి మాటలకు ఎదురు చెపితే వీరుసాటి హిందువులను కూడా తమ మతం నుండి గెంటేస్తారు.

వారి జీవితం బాగా హాయిగా సాగాలి అంటే,వీరికి పని మనుషులు , బట్టలుతికి ఇస్త్రీ చేసేవారు , క్షవరం చేసి బుర్ర మర్దనా చేసేవారు…..ఇలా రకరకాల వారు వర్ధిల్లాలి అని ఆశించే మనసున్న ఈ మారాజులకు సామ్యవాదం అంటే దేశద్రోహం లా కనపడుతుంది.

వీళ్ళని ఇగ్నోర్ చెయ్యాలా లేదా వీరికి కాస్త ఇంగిత జ్ఞానం నేర్పించాలా అన్నది నాకు అర్ధం కావటం లేదు !!!

Raghu Sreemantula

You missed