మానవ అవతారం దాల్చిన దేవుళ్లకు చావు ఉండదని, సజీవంగా సమాధిలోకి వెళ్లిపోతారని కొంతమంది నమ్ముతారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ సమాధి నుంచి ప్రాణాలతో బయటకు వస్తారని అనుకుంటారు. ఆఫ్రికాకు చెందిన ఓ పాస్టర్ కూడా ఇదే అనుకున్నాడు. ‘‘నేను దేవుడి.. బతికుండగానే నన్ను సమాధి చేయండి. మూడు రోజుల తర్వాత జీసస్‌లా ప్రాణాలతో తిరిగి వస్తా..’’ అని తన అనుచరులకు చెప్పాడు. అది నిజమే కాబోలు అనుకుని వారు అతడు చెప్పినట్లే చేశారు. మరి, అతడు మూడు రోజులైనా సమాధిలో బతికే ఉన్నాడా? ప్రాణాలతో బయటకు వచ్చాడా?

జాంబియన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్ సకారా.. తనని తాను దైవం పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని ప్లాన్ చేశాడు. తన అనుచరులు వద్దని వారిస్తున్నా.. అతడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పిక్నిక్ వెళ్లిన ఈజీగా మూడు రోజులు సమాధిలో ఉండి వచ్చేస్తానని చెప్పాడు. 1

‘‘ఆ దేవుడి బిడ్డలా నేను నేను కూడా మూడు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చేస్తాను. మీరెవరూ ఆందోళన చెందవద్దు’’ అని తెలిపాడు. అయితే, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ముగ్గురు చర్చి సిబ్బందితో కలిసి ఈ ప్లాన్ చేశాడు. సుమారు నాలుగు అడుగుల గొయ్యి తవ్వారు. ఆ తర్వాత జేమ్స్ చేతులను వెనక్కి కట్టేసి బతికుండగానే అతడిని పూడ్చిపెట్టేశారు. మూడు రోజుల తర్వాత.. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారు. పాస్టర్ జేమ్స్ సమాధి నుంచి బయటకు రానున్నారని చెప్పారు. దీంతో జనమంతా అక్కడ గుమిగూడారు.

చర్చి సిబ్బంది సమాధి తవ్వారు. జేమ్స్ బతికి ఉంటాడని భావించారు. బ్యాడ్ లక్.. అప్పటికే జేమ్స్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు గాఢ నిద్రలో ఉన్నాడని, తప్పకుండా బతుకుతాడంటూ అతడి అనుచరులు ప్రార్థనలు చేశారు. కానీ, జేమ్స్ బతకలేదు. అతడిని సమాధిలో పడుకోబెట్టిన ముగ్గురు సిబ్బందిలో ఒకరు పోలీసులకు లొంగిపోయాడు. మిగతా ఇద్దరు పరారిలో ఉన్నారు. అయితే, ఇలాంటి స్టంట్లు ఆఫ్రికాలో సర్వసాధారణమే. అక్కడి ప్రజలను నమ్మించేందుకు కొంతమంది ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విశ్వాసం ఉండవచ్చు.. కానీ, మూఢ విశ్వాసం ఉండకూడదని పలువురు హితవు పలుకుతున్నారు.

(Copied From:
Geedi Saraiah garu..)
— Rajeshwer Chelimela , Jvv Telangana

You missed