కొంచెం కొంచెం.. ఇంకొంచెం… పథకాలు పాతవే.. పెంచుతూ పోతామన్న కేసీఆర్.. కేసీఆర్ మార్క్ మేనిఫెస్టో విడుదల…. గృహలక్ష్మీ పెంపు లేదు… డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రస్తావనా లేదు.. అటకెక్కిన నిరుద్యోగ భృతి… పేద మహిళలకు మూడు వేల భృతి.. సన్నబియ్యం పథకం, పేదలకు బీమా ధీమా..
రాష్ట్ర బడ్జెట్‌పై పథకాల భారం ఎలా ఉంటుందో కేసీఆర్‌కు అవగతమైంది. చెప్పినంత సులువు కాదని తేలిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు మించి బీఆరెస్ పథకాలుండాలె కాబట్టి.. తనదైన మార్కు మేనిఫెస్టోను విడుదల చేశాడు కేసీఆర్. కొంచెం కొంచెంగా…