(దండుగుల శ్రీనివాస్ – చీఫ్ బ్యూరో)
పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. బీఆరెస్ ఖాతా తెరవకుండా తొలిసారిగా డక్ అవుట్ కానుంది. బీజేపీని మోడీ మానియా కాపాడనుంది. ఇక వాస్తవం ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎవరికెన్ని అని విశ్లేషించినప్పుడు. చెరిసగం సీట్లు కాంగ్రెస్, బీజేపీలకు వచ్చేలా ఉన్నాయ. పది నుంచి పద్నాలుగు అంటూ ఈ రెండు పార్టీలు మొదటి నుంచి ఊదరగొడుతూ ఉన్నాయి. కానీ వాస్తవంగా పరిస్థితులు అలా లేవు. కాంగ్రెస్‌కు తమ లోపాలు తెలుసు. వారి సమన్వయలేని కొట్టొచ్చినట్టు కనిపించింది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కొంపముంచుతుందనీ అర్థమయ్యింది.
కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఇప్పుడు 8 వద్దకు వచ్చి ఆగింది కాంగ్రెస్. ఇది ఫైనల్ కాదు. మరొకటి స్థానం తగ్గినా ఆశ్చర్యం లేదు. అంటే కాంగ్రెస్ ఏడింటితో సరిపెట్టుకుంటే, బీజేపీకి తొమ్మిదివ వరకు వస్తాయి. ఎంఐఎంకు ఎలాగూ తన ఒక స్థానం పదిలం కానుంది. బీఆరెస్‌కు ఒక్కస్థానమూ వచ్చే సీన్ కనబడటం లేదు.
మొత్తానికి ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆరెస్ బిస్తర్ కట్టింది. బీజేపీ బిస్తర్ పరిచింది. కాంగ్రెస్‌కు ఖంగుతినక తప్పలేదు. బీజేపీ అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా మోడీ మానియా పనిచేసింది. ఇక బీజేపీలో ఎక్కువ మోజార్టీ వచ్చే నియోజకవర్గాల్లో మల్కాజిగిరిలో ఈటల రాజేందర్, నిజామాబాద్‌లో అర్వింద్‌కు చాన్స్ ఉంది.