Month: June 2024

డీఎస్‌ ఇకలేరు..! ఇంట్లోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సీనియర్‌ బీసీనేత..!! చివరి ఘడియల్లో వెంటాడిన తీవ్ర అనారోగ్యం.. రేపు సాయంత్రం నిజామాబాద్‌లో అంత్యక్రియలకు ఏర్పాటు..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ కనుమూశారు. ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ సాయత్రం వరకు ఆయన మృతదేహాన్ని నిజామాబాద్‌లోని నివాసానికి తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్‌లో…

కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరీ ఉన్నట్టా…? ఊడినట్టా..?? జిల్లాలో ముగ్గురికి వరించిన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు.. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటన… అధికారిక ఉత్తర్వులు ఇప్పటికీ లేవు.. నిజామాబాద్‌ ఎంపీ సీటు ఓడినందుకు.. ఈ పదవులు మళ్లీ ఇస్తారా..? మారుస్తారా..?? జిల్లా కాంగ్రెస్‌లో చర్చ…

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: కార్పొరేషన్‌ చైర్మన్ పదవులపై ప్రతిష్ఠంభన నెలకొన్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ ఎన్నికలకు ముందు హడావుడిగా కార్పొరేషన్‌ చైర్మన్లను ప్రకటించాడు. ఇవి కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు దోహదం చేస్తాయని భావించారు. నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు…

కామారెడ్డి కలెక్టర్‌ ఎవరి మాట వినడు… ! నేతల మాటలు డోంట్‌ కేర్‌…!! పార్టీ ఏదైనా, నాయకుడెవరైనా తను అనుకున్నదానికే ఓకే..! ఫైరవీలు నడవవు…. ప్రయార్టీ చెల్లదు.. కామారెడ్డి నేతలకు మింగుడు పడని కలెక్టర్‌ వైఖరి.. ఇసుక క్వారీల ఎడాపెడా అనుమతులకే బ్రేక్‌.. తప్పదు.. ఆయనతో అదో తిప్పలవారికి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం బ్యూరో చీఫ్‌: ఆశిష్‌ సాంగ్వాన్‌..కామారెడ్డి కలెక్టర్‌ ఆయన. నిర్మల్‌ జిల్లా నుంచి రీసెంట్లీగా ఇక్కడికొచ్చాడు. అప్పటి వరకు ఒక లెక్క.. ఈ సార్‌ వచ్చినాక ఒక లెక్క. పార్టీలేవైనా, నేతలెంత తీస్మార్‌ఖాన్‌లైనా ఈయన వినడు. ఉహూ ససేమిరా…

శ్రీకాంతాచారి అమరుడయ్యాడు.,! కేసీఆర్‌ను అమరత్వం నుంచి కాపాడాడు..!! తన చావు పయనం తెలంగాణ సాకారం దిశగా పోయేలా చేశాడు..!! తెలంగాణ ప్రకటించకతప్పలేదు కేంద్రానికి…! నైజం..! (కేసీఆర్‌ మరోకోణం..) ధారావాహిక-9

నైజం..! (కేసీఆర్‌ మరోకోణం..) ధారావాహిక-9 ………………………….. ‘ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చచ్చిపోయి బతికించాడు గానీ.. తెలంగాణ భవన్‌ను కూడా కబ్జా చేసేందుకు అంతా రెడీ అయ్యింది..’ ‘ ఇక రేపోమాపో తెలంగాణ భవన్‌ కూడా లేకుండా పోయేది’ అలాంటిది వైఎస్‌ఆర్‌ సచ్చుడు..…

ఉద్యోగ సంఘాలు…బీజేపీ యూటర్న్‌…!! సీఎం రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అగౌరవం..! వేచి చూసీ చూసీ విసిగెత్తిపోయి… జేఏసీ మీటింగ్‌ పెట్టి అల్టిమేటం జారీ చేసినా కనీసం పట్టించుకోని రేవంత్‌.. !! టీఎన్‌జీవో, టీజీవోల అధ్యక్షులు, ముఖ్య నేతలంతా బీజేపీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు.. ఇక బీజేపీ స్టాండ్ తీసుకోనున్న ఉద్యోగులు….. ఉద్యోగ సంఘాల నేతలు ఢిల్లీలో బిజీబిజీ…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో : కేసీఆర్‌ సర్కార్‌ అవమానపర్చింది. పట్టించుకోలేదు. ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించాడు కేసీఆర్‌. దీంతో ఎన్నికల్లో గట్టి బుద్దే చెప్పాయి ఉద్యోగ సంఘాలు. కాంగ్రెస్‌కు సపోర్టు దొరికింది. అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడా అదే…

రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో ఘోరంగా చనిపోయాడు. అంతే..! అది యావత్‌ దేశానికి షాక్‌.. ఆంధ్రలో పెను ప్రకంపనలు.. తెలంగాణలో మాత్రం పండుగ వాతావరణం. అవును..! ఓ సమైక్య రాక్షసుడు చచ్చాడు. పీడ విరగడైంది. రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఎన్నటికీ తెలంగాణ రాకుండె…!! నైజం..! (కేసీఆర్‌ మరోకోణం..) ధారావాహిక -8

నైజం..! (కేసీఆర్‌ మరోకోణం..) ధారావాహిక -8 …………………….. కొన్నిసార్లు కాలం ఘోరంగా దెబ్బకొట్టింది కేసీఆర్‌ను. మరికొన్ని సార్లు ఆ కాలమే చేయూతనిచ్చి పైకి లేపింది. ప్రకృతి కూడా సహకరించబట్టే కేసీఆర్‌ ఇవాళ ఇంత దాకా వచ్చాడు. అదంతా తన క్రెడిబిలిటీ, తన…

ఆర్మూర్‌ కోసం ఆమరణ నిరాహార దీక్ష అస్త్రం.. ! సీఎం రేవంత్‌రెడ్డికి వారం డెడ్‌లైన్‌ ఇచ్చిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. !! ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూల్‌ భవనాల కోసం నిధులు మధిరకు తరలించడంపై నిరశన.. ఒకటి కొడంగల్‌, మరొకటి మధిరకు.. మరి మాకు..? ఆర్మూర్‌కు ఇస్తామని మాటిచ్చి రూ. 150 కోట్లు తరలించుకుపోతారా..? ఉత్తర తెలంగాణ పట్టదా…? దక్షిణ తెలంగాణకే నిధులా…?చర్చకు తెరతీసిన రాకేశ్‌రెడ్డి లేఖ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా ఆయన సీఎం రేవంత్‌కు ఓ లేఖ రాశాడు. అదేమంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నానని. ఎవరి కోసం..? ఎందుకోసం..? ఆర్మూర్‌కు నిధులివ్వకుండావ…

‘పీసీసీ చీఫ్‌’ పెండింగ్‌.. ! కేబినెట్‌లోకి సుదర్శన్‌రెడ్డి.. !! పీసీసీ చీఫ్‌ రేసులో మహేశ్‌తో పాటు మధుయాష్కీ, భట్టీ, శ్రీధర్‌బాబు.. ఇప్పట్లో చీఫ్‌ పదవి నియామకం ఉండబోదని పరోక్షంగా సిగ్నల్‌ ఇచ్చిన దీపాదాస్‌ మున్షీ.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేరును సూచించిన సీఎం రేవంత్‌… కేబినెట్‌ విస్తరణ ముహూర్తం జూలై 2న..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో : పీసీసీ చీఫ్‌ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టేసింది అధిష్టానం. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ పదవి నేటితో ముగిసింది. దీన్ని త్వరగా పూర్తి చేస్తారని భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జి…

మిగిలింది గుప్పెడుమందే..! ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే కేసీఆర్‌..!! తాను తోడుకున్న గోతిలో తానే పడ్డ బీఆరెస్‌ రథసారథి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: తాను పార్టీ పెట్టినప్పుడు గుప్పెడు మందితోనే పెట్టానని, అంతా హేళన చేశారని కేసీఆర్‌ అంటుంటాడు. చివరికి అదే పరిస్థితికి నేడు చేరింది.ఉన్న ఎమ్మెల్యేలంతా తలోదారి చూసుకుంటున్నారు. అందరినీ ఫామ్‌ హౌజ్‌కు రమ్మంటే.. వచ్చింది…

బెదిరింపుల జీవన్‌రెడ్డి…! అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు..!! గెలిపించండి.. లాస్ట్ ఎన్నికలంటూ నాడు ప్రజల వద్ద వేడుకోలు.. ఇప్పుడు మంత్రి పదవి కోసం రాజీనామా అస్త్రం…!

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం హైదరాబాద్‌ ప్రతినిధి: ఆయనంతే. సీనియర్‌ లీడర్‌ కానీ పదవుల కోసం ఇలా అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. ఆయనే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసేటప్పుడు ఇవే…

You missed