వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ దెబ్బకు ఇద్దరు అధికారులు బలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బెదించి తన మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యాన్ని తరలించుకుపోయిన కేసులో ఇద్దరు అధికారులపై వేటు పడింది. సివిల్‌ సప్లై శాఖ జిల్లా అధికారి చంద్రప్రకాశ్‌తో పాటు డీఎం జగదీశ్‌బాబును సస్పెండ్‌ చేసింది సర్కార్‌. ఇదిప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే షకీల్‌ విషయంలో కాంగ్రెస్‌ సర్కార్‌ అష్టదిగ్బంధనం చేస్తూ వస్తోంది. కొడుకు రాహిల్‌ యాక్సిడెంట్‌ వివాదంలో షకీల్‌ ఇంకా బయటకు రాని విధంగా కేసలు పెట్టింది. కాగా, షకీల్‌కు చెందిన మిల్లులకు డీఎస్‌వో నిబంధనలకు మించి 80 కోట్ల మేర ధాన్యం పంపాడు.

దీన్ని బియ్యంగా గానుగాడించి సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సి ఉండగా అవి ఇవ్వలేదు. ఆ తరువాత వీటిని వేర్వేరు మిల్లులకు తరలించారు. అయితే ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూసింది సర్కార్‌. షకీల్‌తో డీఎస్‌వో, డీఎం అంటకాగి ప్రభుత్వానికి నష్టం వచ్చేలా వ్యవహరించాలని ఇద్దరిపై వేటు వేసింది. వాస్తవంగా ఇది డీఎస్‌వో పరిధిలోకి వచ్చే అంశం. అప్పటికీ డీఎం రాలేదు. షకీల్‌ ఎమ్మెల్యేగా ఉండగా బెదిరింపులు మామూలుగా ఉండేవి కావు. అదే విధంగా డీఎస్‌వోనూ బెదిరించాడు. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి ఇబ్బడిముబ్బడిగా ధాన్యం కేటాయించాడు చంద్రప్రకాశ్‌. ఇదే అతని కొంప ముంచింది. డీఎం సర్వీసుకు ఎసరు పెట్టింది.

ఎంతకూ రికవరీ కాకపోవడంతో ఆర్‌ఆర్‌ యాక్టు పెట్టారు. అయినా రాలేదు. కోర్టును ఆశ్రయించాడు షకీల్‌. దీంతో ఇది పెండింగ్‌లో పడింది. కానీ ఆలస్యంగా ఇది సర్కార్ దృష్గికి పోయింది. ఇంకేముంది.. షకీల్‌ పేరు వెల్లడి కాగానే వెంటనే ఈ ఇద్దరి అధికారులపై వెంటనే వేటు పడింది. డీఎస్‌వోకు తెలుసు. ఈ విషయంలో తనపై వేటు పడనుందని, కానీ డీఎం మాత్రం బిత్తరపోయాడు. ఇది తన పరిధికాదని, తనప్పుడు బాధ్యతలే తీసుకోలేదని లబోదిబోమంటున్నారు. కమిషనర్‌ను కలిసి విషయమంతా వెల్లడిస్తానని కూడా చెబుతున్నాడు.

 

You missed