దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

అతను సాక్షి నిజామాబాద్‌ బ్యూరో ఇన్చార్జి. పేరు భద్రారెడ్డి. ఖమ్మం జిల్లాకుచెందిన వాడు. ఇలా నిజామాబాద్‌కు బదిలీపై వచ్చాడో లేదో తనకు సహజంగా అలవాటైన బ్లాక్‌మెయిలింగ్‌ దందాకు తెగబడ్డాడు. రాజకీయనాయకులు, అధికారులు, ఉన్నతాధికారులు.. తేడా ఏమీ లేదు. అందరినీ టార్గెట్‌ చేయాలె. బెదింరించాలె. వసూలు చేయాలె. వారు చేసింది తప్పు కాదని తెలిసినా.. సదరు మన భద్రారెడ్డి బెదిరించే తీరుకు భయపడి ఎంతో కొంత సమర్పించాలి.

ఈ వసూళ్ల దందాకు యాజమాన్యం ముసుగేస్తాడు. మా మేనేజ్‌మెంట్‌ సర్క్యూలేషన్‌ టార్గెట్‌ పెట్టింది…ఇస్తావా.? చస్తావా..? అంటాడు. యాడ్స్‌ ఇస్తే ఓకే లేకపోతే నీకు చావే అంటాడు. ఇదీ భద్రారెడ్డి స్టైల్‌. సరే ఇదంతా సోది మాకెందుకు.. మేనేజ్‌మెంట్‌ వత్తాసు లేందే.. వారి వత్తాసు లేందే ఇదంతా జరుగుతుందా అని అలా కసురుకోకండి. సదరు ఈ పతివ్రతే తాజాగా గన్‌లైసెన్స్‌ కోసం అప్లై చేసుకుందట. తనకు ప్రాణహానీ ఉందని.

చేసేదంతా చేసి..ఎవడు ఏం చెప్పినా నాలుగు పైసలు రాల్తే చాలు అనుకునే రీతిలో వార్తలు రాసి.. మేనేజ్‌మెంట్‌ పరువును ఇలా ఇందూరు నడిబజారులోకి లాగి.. దానికి సర్క్కూలేషన్‌, యాడ్స్‌ కలరింగ్, కవరింగ్‌ ఇచ్చి తను రాసే వార్తలు వాస్తవమే గానీ రాజకీయనాయకులతో తనకు ప్రాణహానీ ఉందని గన్‌ లైసెన్స్‌కు అప్లై చేసుకున్నాడట ఈ పత్తిత్తు భద్రారెడ్డి.

ఇక కొసమెరుపు ఏంటంటే… నిజామాబాద్‌ జిల్లా బ్యూరో ఇన్చార్జి ఈ బ్లాక్‌మెయిలర్‌కు జిగ్రీ దోస్తు. ఇలా ఉప్పందిస్తాడన్నమాట. వాటల్లో షేరింగ్ ఉంటుందున్నమాట. మరి నమస్తే మాట ఎవడింటాడండి… ఇలా సాక్షి లాంటి మెయిన్‌ స్ట్రీమ్‌లో ఉన్న దాంట్లోనే నాలుగు పైసలు వెనుకేసుకోవాలి.

You missed