ఉమ్మడి జిల్లాలోని అన్ని బీఆరెస్‌ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేసుకోవడం తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కేసీఆర్‌ ప్రభావం ఉండాలనే ఉద్దేశ్యంతో కామారెడ్డి నుంచి బరిలోకి దిగారాయన. మొన్నటి దాకా కామారెడ్డి ఓ వివాదాల కేంద్రం. నాయకుల ఆధిపత్యపోరుకు కేరాఫ్‌ అడ్రస్‌. కేటీఆర్‌ ఎంత చెప్పినా… ఎన్ని హితోపదేశాలు చేసినా కుక్క తోక వంకరే అన్నట్టుగా ఉంది. అయినా అందరనీ కలుపుకుని పోతున్నారు. కలుపుతున్నారు.

ఐక్యంగా ముందుకు సాగేందుకు చమటోడుస్తున్నారు కేటీఆర్‌. ఇవన్న ఒక లెక్క… ఇవాళ్టి నుంచి ఒక లెక్క అన్నట్టు నేటి కేటీఆర్‌ సభతో అక్కడ.. ఇక్కడ .. చుట్టుపక్కల సీన్ మారనుంది. ఇవాళ కేసీఆర్ నామినేషన్‌ వేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆయన రాకపై సర్వత్రా ఉత్కంఠ, ఉత్సాహం నెలకొన్నది. సభలో ఆయన ప్రసంగం ఎలా ఉంటుందో టెన్షన్‌ కూడా మొదలైంది అందరికీ. తన మార్కు స్పీచ్‌ తప్పుకుంటా ఉంటుంది.

లోకల్‌ కంటెంట్‌తో పాటు పార్టీకి దిశానిర్ధేశం.. ప్రతిపక్షాలకు చురకలే కాదు దేశ రాజకీయాలపై ఆయన తనదైన శైలిలో ఇక్కడి నుంచి ప్రసంగించనున్నారు. ఇవాళ జరిగే సభ, కార్యక్రమాల ద్వారా కామారెడ్డి సీనే కాదు.. ఉమ్మడి జల్లాపైనా దీని ప్రభావం ఉంటుందంటున్నారు గులాబీ నేతలు, అభ్యర్థులు. ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకుపోతున్న బీఆరెస్‌కు ఇవాళ గులాబీ బాస్‌ కామారెడ్డి ఎంట్రీతో ఇచ్చే సభ మరింత బూస్టింగ్‌ను ఇవ్వనుంది.

You missed