బీసీల దెబ్బ కాంగ్రెస్‌కు బాగానే తాకింది. బాన్సువాడ కాంగ్రెస్‌ లీడర్‌ ఆత్మహత్యాయత్నంతో ఒక్కసారిగా ఉమ్మడి రాజకీయాల్లో చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఏనుగు రవీందర్‌ రెడ్డి అప్పటికప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకుని టికెట్‌ తెచ్చుకోవడంతో కాసుల బాలరాజ్‌కు మింగుడు పడలేదు. దీంతో ఆమరణ దీక్షకు దిగాడు. ఇంట్లోకి వెళ్లి పురుగల మందు తాగడంతో పరిస్థితి విషమించి నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇవాళ ఏనుగు రవీందర్‌ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్‌ వేయాలని భావించారు. తన బలమేమిటో చూపాలనుకున్నాడు. కాసుల బాల్‌రాజ్‌ సపోర్టు చేయకున్నా.. మదన్‌మోహన్‌రావు సాయంతో బాన్సువాడలో పాగా వేద్దామనుకున్నాడు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేందుకు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్న తరుణంలో కాసుల బాల్‌రాజ్‌ పంటికింద రాయిలా మారాడు. ఇప్పుడు చర్చంతా బీసీలు, మున్నూరుకాపులకు అన్యాయం అనే అంశంపై జరుగుతోంది. ఈ ఒక్కదెబ్బతో మిగిలిన నియోజకవర్గాల్లోని బీసీలు, మున్నూరుకాపులు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారే ప్రమాదం లేకపోలేదు.

You missed