జిల్లా రాజకీయాల్లో.. ప్రత్యేకంగా చెప్పాలంటే బాల్కొండ నియోజక వర్గంలో నాసిరకం రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న వేళ గంజాయి అనే మాటను ఎక్కువగా పలికించే.. వినిపించే రాజకీయం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థుల మధ్య గంజాయి ఆరోపణలు పరస్పరం జరుగుతుంటే నియోజకవర్గ ప్రజలు ఈ అంశంపై చర్చించకోకుండా ఉండలేరు కదా.

ఆరోపించేవారు అయినా సరే, ఆరోపణలు తిప్పి కొట్టిన వారు అయినా సరే ముఖ్యంగా మూడు రాజకీయ ముఖాలు బాల్కొండ నియోజకవర్గ ప్రస్తుత రాజకీయాల్లో తెరపైన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈయన గంజాయి వ్యాపారం చేసుకునే ఖర్మలో గాని.. రాజకీయ అనివార్యంలో గాని లేరనేది ప్రజల నోట ‘వాస్తవం’ పరిశీలించింది. ఆరోపణలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్‌ రెడ్డి కూడా గంజాయి వ్యాపారం చేసే బాపతు కాదనేది నియోజకవర్గ ప్రజల కుల్లంకుల్ల అభిప్రాయం.

కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సైతం గంజాయి లాంటి వ్యవహారాలను ఎంటర్టైన్ చేసే బాపతు కాదనేది కూడా బాల్కొండ కాన్‌స్టెన్సీ ప్రజల నిశ్చితాభిప్రాయం. ఇదంతా ‘వాస్తవం’ పర్యటించి పరిశీలించిన విషయాలు. వీరు కూడా ఎలాగైతే ఆ బాపతు కాదంటున్నారో.. ప్రశాంత్‌ రెడ్డి కూడా అలాంటి బాపతు కానేకాదనేది ‘వాస్తవం’ జరిపిన పరిశీలనలో నిగ్గు తేలింది. అంటే ఇంకా ప్రజల అభిప్రాయాల్లో గంజాయి అనే దిగజారుడు రాజకీయాలకు స్థానం లేదని.. వారు అభివృద్ధి, ఇంకా ఇతర అంశాలపైనే ఈసారి అసెంబ్లీ ఎన్నికలను ముడిపెట్టి ఆలోచిస్తున్నారని స్పష్టమవుతున్నది. గంజాయి రాజకీయం.. రాజకీయాలను బాల్కొండ నియోజకవర్గంలో నాసిరకం చేస్తున్నదని నియోజకవర్గ ప్రజానీకం స్పష్టంగా రిపోర్టు చేస్తున్నది.

బరిలో ఉన్న ముగ్గురు ప్రధాన అభ్యర్థులు గాని.. అభ్యర్థుల వెనుక తరాలు గాని ఇలాంటి ఆలోచనలకే సంబంధం లేని వారు అనే ఘనత ఉందనేది ప్రజల అభిప్రాయ సారాంశం. అసలు సిసలు పోరును.. అభివృద్ధికి సంబంధించిన నిజాల ను చూడకుండా మా చేత ఓటు వేయించలేరని.. గంజాయి సమస్యను అందరూ కలిసి రూపుమాపాలే తప్ప దానిని రాజకీయ గంజాయి రుగ్మతగా మార్చి ఎవరు పెద్ద తప్పు చేస్తున్నారో కొద్ది రోజుల్లోనే తెల్చేస్తామని నియోజకవర్గంలో చాలా చోట్ల కామెంట్లు కొనసాగుతున్నాయి. ముందు రాజకీయ గంజాయి రుగ్మతను వీడండి… నియోజకవర్గంలో యువత గంజాయి బారిన పడకుండా సహకరించండి అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నారు.

You missed