కామారెడ్డి జిల్లా బీఆరెన్‌ నేతలకు మళ్లీ అక్షింతలు వేశాడు కేటీఆర్‌. సమన్వయ లేని, గ్రూపుల లొల్లిలతో పరిస్థితి అదే మాదిరిగా ఉందనే విషయాన్ని తెలుసుకున్న ఆయన.. ఆ నలుగురికి చురకలంటించారు. ముఖ్య కార్యకర్తలు, నాయకులు ఆ నలుగరిపై ఫిర్యాదులు చేశారు. అంతా సావధానంగా విన్న కేటీఆర్‌… చురకలంటించాడు. కౌన్సిలర్లను మీటింగుకు పిలవకపోవడాన్ని కేటీఆర్‌ తప్పుబట్టాడు. మళ్లీ త్వరలో కామారెడ్డిలో మీటింగు పెడతానని, అప్పుడు అంతా హాజరుకావాలని ఆదేశించారు.

సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తన్న కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతీ నాయకుడు సర్పంచు ఎన్నికల ఊరికో కథానాయకుడు కావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సర్పంచు ఎన్నికలాగా భావించి ఊరికి డెబ్భై ఐదు శాతం ఓట్లు వచ్చేలా కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు. బుధవారం ప్రగతిభవన్‌లో కామారెడ్డి బీఆరెస్‌ ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతీ మండలం చొప్పున ఆయన రివ్యూ తీసుకున్నారు. లోటుపాట్లు, బలాబలాల గురించి అడిగి తెలుసుకున్నారు.

కొందరు సమన్వయం లేదని, నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలతో పార్టీకి నష్టం జరుగుందని తెలియజేశారు. దీనిపై కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. ఎలాంటి గ్రూపులకు తావు లేకుండా అంతా ఎవరికి వారు పనిచేసుకోవాలని, మీకు సమన్వయకర్తగా సీఎం కేసీఆరేననే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

You missed