ఆయనంతే. ఆయన స్పీడ్‌కు కళ్లెం వేయడం ఎవరి వళ్లా కాదు. వయస్సు డెబ్బై దాటినా యువకుడి మాదిరిగానే ఆయన దూకుడు ఉంటుంది. ఎంతో ఓపిక మనిషి. నిత్యం వందలాదిగా వచ్చిన వారితో ఓపికగా మాట్లాడి వారిని పంపి.. ఆ తర్వాత తన కార్యక్రమాల్లో బిజీగా గడపడం ఆయనకు అలవాటే. కానీ ఈ మధ్య ఆయనకు లీడర్ల తాకిడి పెరిగింది. స్థానికంగా ఉండి ప్రజల అవసరాలు గుర్తించి పరిష్కరించాల్సిన లోకల్ లీడర్లు తెల్లారి లేస్తే చాలు గోవన్న ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు. ఆయన షెడ్యూల్ ప్రకారం పోవాల్సిన పనికి వీరే ప్రధానం ఆటంకంగా మారతారు. దీంతో ఆయన ఇటీవల లీడర్లకు క్లాస్ పీకాడు.
అయినా ఇవాళ కొంత మంది యధావిధిగా తన ఇంటికే వచ్చి ఆసీనులయ్యారు. దీంతో గోవన్న మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నా దగ్గర ఉంటే.. జనం ఇక్కడికే వస్తారు. అక్కడే ఉండి వారి సమస్యలేమిటో తెలుసుకోండి అంటూ మందలించాడు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మొదలుకొని రాత్రి 9 గంటల వరకు బిజిబిజీగా గడిపాడు బాజిరెడ్డి గోవర్దన్, డిచ్‌పల్లిలో చాపల మార్కెట్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన నుంచి మొదలుకొని, పరామర్శలు, ప్రారంభోత్సవాలు, ప్రొసీడింగులు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, సిరికొండ మండల కేంద్రంలో ప్రెస్ భవన ప్రారంభోత్సవం, వివిధ పార్టీల నుంచి బీఆరెస్‌లో చేరిన వారికి సాదర ఆహ్వానం పలుకుతూ వారిని పార్టీలోకి ఆహ్వానించడం, ధర్పల్లి మండలంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉపకార్య నిర్వాహక ఇంజినీరింగ్ కార్యాలయం ప్రారంభం… పలకరింపులు,పరామర్శలు.. ఇలా ఎగతెరపి లేకుండా, విరామం ఎరగకుండా ఆయన పన్నెండు గంటల పాటు పర్యటిస్తూ ఉన్నాడు తన పెద్ద నియోజకవర్గం రూరల్‌లో.
జగన్ వెంటే ఉన్నాడు. తండ్రీ, కొడుకులు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఎవరికి వారే తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. గోవన్న అంటే అంతే. ఈ మధ్య ఆరోగ్యం సహకరించుకున్నా.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదే స్పీడు. అదే మాస్ పోకడ. అదే సత్వర సమస్యల పరిష్కారం కోసం తీసుకునే తెగువ, చొరవ. అందుకే ఆయన మాస్ లీడర్‌గా నిలిచాడు. ఇక ఈ దూకుడు మరింత కొనసాగనుంది.