కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతా తానై టికెట్ల పంపకాల్లో వ్యవహారించాలని చూస్తున్నారు. ఇందూరులో కూడా తనదే హవా నడవాలని తనకు కావాల్సిన వారికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నాడు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జిల్లా నుంచి పెద్ద పదవిలో ఉన్న తన మాటకు చెల్లుబాటు కాకపోవడంతో మహేశ్ కాకమీద ఉన్నాడు. రేవంత్ పై గుర్రుగా ఉన్నాడు. ఆర్మూర్ నుంచి శుక్రవారం వినయ్‌రెడ్డి తన టీమ్‌తో గాంధీభవన్‌లో జాయిన్ అయ్యాడు.
ఆ మీటింగుకు మహేశ్ డుమ్మా కొట్టాడు. మధుయాష్కీ రాలేదు. మనాల మోహన్‌రెడ్డీ లేడు. కానీ రేవంత్ మాత్రం సర్వేలో వినయ్‌కు మంచి మార్కులొచ్చాయని పరోక్షంగా అతనికే టికెట్ అనే విధంగా మాట్లాడటంతో ఈ గ్రూపు తగాదాలు కాస్త మరింత బలంగా బహిరంగ చర్చకు తెర తీశాయి. రచ్చ రచ్చ చేశాయి. అర్బన్ నుంచి తనకు లేదా… బాల్కొండ మాజీ ఎమ్మెల్యే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఈరవత్రి అనిల్‌కు ఇవ్వాలని మహేశ్‌కుమార్ డిమాండ్ చేస్తున్నాడు. అనిల్ బాల్కొండలోనే పనికిరాలేదు. అర్బన్‌లో ఏం పనికొస్తాడనే ఫీలింగ్‌లో అధిష్టానం ఉంది. అయితే తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నాడు మహేశ్.కానీ ధర్మపురి సంజయ్‌కు ఇచ్చేందుకే రేవంత్ మొగ్గు చూపుతున్నాడు.
డీఎస్‌కు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటంతో ఇదే పట్టుమీద ఉన్నాడు. మరోవైపు రెండో బీసీ టికెట్ కూడా నిజామాబాద్ పార్లమెంటులో ఇస్తామనే వాగ్దానం ఉంది కాబట్టి ఆర్మూర్ బీసీకే ఇవ్వాలనే పంతం మీద ఉన్నాడు మహేశ్. కానీ తాజాగా వినయ్ పేరును పరోక్షంగా ప్రస్తావించే సరికి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు మహేశ్. మొత్తానికి జిల్లాలో తనదే పై చేయిగా నడిపిస్తున్నాడు రేవంత్. బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి కాకుండా కెప్టెన్ కరుణాకర్‌రెడ్డికి ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు రేవంత్. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు మహేశ్.
అంతా తను అనుకున్నట్టే జరిగితే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సొంత జిల్లాలో కూడా తన మాట చెల్లుబాటు కాదా..? అని నిలదీస్తున్నాడు. అకలపాన్పెక్కుతున్నాడు. మీటింగులకు దూరదూరంగా ఉంటున్నాడు. మరోవైపు రూరల్ నుంచి మండవ వెంకటేశ్వరరావు పోటీ చేస్తాడనే ప్రచారం ఊపందుకున్నది. ఈనెల 17న సోనియా సభలో మండవ చేరుతున్నాడనే ప్రచారం ఊపందుకున్నది. కానీ మండవ పోటీ విషయంలో సందిగ్థత ఉంది. ఇప్పటి రాజకీయాలకు ఆయన అవుట్ డేటెడ్. తట్టుకోవడం కష్టం. అందుకే అరికెలను ఎంకరేజ్ చేస్తున్నాడు. అరికెల కూడా రేవంత్ టీమే.. బాల్కొండ నుంచి సునీల్ కూడా రేవంత్ టీమ్‌లో చేరిపోయాడు. ఇప్పుడు అంతా రేవంత్ మానియా కొనిసాగుతోంది ఇందూరు కాంగ్రెస్ రాజకీయాల్లో.