అక్షర క్రమంలో ముందున్న ఆర్మూర్ లాగే.. జీవన్ కూడా అన్నింటా నెంబర్‌వన్‌గా ఉన్నాడని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. శుక్రవారం ఆయన టికెట్ కన్ఫాం అయిన తర్వాతా నియోజకవర్గానికి వస్తున్న రాక నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రసంగించారు. జీవన్ ఉద్యమ ప్రస్తానాన్ని గుర్తు చేశారు. ఎర్రజొన్న బకాయిలు ఇప్పంచిన ఘతన జీవన్‌దేనన్న కవిత…. ఆనాడు డీఎస్ బర్త్ డే సందర్బంగా జిల్లాకు రావడానికి ప్రయత్నం చేసిన పెద్ద నేతలకు సైతం అడ్డుకొని తెలంగాణ ఆకాంక్షను రాష్ట్రానికి, దేశానికి చాటి చెప్పాడని యాది చేసుకున్నారు.
ఎర్రజొన్న బకాయిల కోసం తొమ్మిది రోజుల దీక్ష కూడా చేపట్టి కాంగ్రెస్ కాల్పులు జరిపినా భయపడలేదని, అనుకున్నది సాధించి తీరారన్నారు.రైతుల పక్షాన నిలబడి కొట్లాడిన జీవన్‌రెడ్డిని 60 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. చెప్పిన హామీలన్నీ తీర్చుతూ వచ్చారని, నిరంతరం ఆర్మూర్ ప్రజల కోసం, ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే యువ నాయకుడు జీవన్‌ను గెలిపించుకోవాలని ఆమె కోరారు. సీఎంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ దేశ రాజకీయాల్లో కూడా అధినేతతో కలిసి పనిచేసే అదృష్టం మీ ఎమ్మెల్యేకు దక్కిందని, ఇది మీ నియోజకవర్గ అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని ఆమె ఆకాంక్షించారు.