కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రచారానికి వెళ్లాడు. ఓ ఐదు చోట్ల కాలుమోపాడు. కలియతిరిగాడు. వచ్చీరానీ భాష ఏదో లాగించేశాడు. ఆవేశంగా డైలాగులు కొట్టాననుకున్నాడు. చప్పట్లు కొట్టిచ్చుకున్నాడు. కానీ ఆ ఐదు చోట్లా అభ్యర్థులు నేలకరిచారు. ఘోర పరాభవం పాలయ్యారు. గౌరీబిదనూర్, చింతామణి, ముల్బగల్‌, బాగేపల్లి, చిక్కబల్లాపూర్‌లలో బండి సంజయ్‌ ప్రచారం చేశాడు.

లయదుఈ ఐదు స్థానాల్లో అభ్యర్థులు ఘోర పరాభవం చెందారు. తమ ముఖం చూసి కాకున్నా.. మోదీ ముఖం చూసైనా ఓట్లేస్తారని అనుకున్నారంతా. కానీ ఎవరి ముఖం చూడలేదు. మోడీని అసలు పట్టించుకోలేదు. ప్రచారాలెన్ని చేసినా.. రోడ్‌ షోలతో ఎన్ని షోలు చేసినా కన్నెడిగులు తమ ఓటు చైతన్యాన్ని ప్రదర్శించారు. బీజేపీని మట్టికరిపించారు.

You missed