నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులకు శుభవార్త. జిల్లా అధ్యక్షుడిగా బాజిరెడ్డి జగన్‌ను ఎన్నుకున్న తర్వాత తొలిసారిగా కొత్త కమిటీ సభ్యులు జగన్‌ నేతృత్వంలో మంత్రి కేటీఆర్‌ ఇవాళ హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆరేళ్లుగా జిల్లా సంఘ భవన నిర్మణానికి స్థలం కోసం మున్నూరుకాపులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్న విషయాన్ని జగన్‌ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నగరంలో తమకు అనువైన స్థలాన్ని కేటాయిస్తే సంఘ భవనాన్ని నిర్మాణాన్ని చేసుకుని, మున్నురుకాపు విద్యార్థులకు, నిరుద్యోగులకు అనువైన విధంగా హాస్టల్‌ వసతిని, కోచింగ్‌ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంటామని జగన్‌ మంత్రికి వివరించారు.

మంత్రి తొలత జగన్‌ను జిల్లా అధ్యక్షువులంతా ధడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. వెంటనే జగన్‌ చెప్పిన స్థలం సమస్య గురించి సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌తో ఫోన్లో మాట్లాడారు. నగరంలోని వినాయక్‌నగర్‌ నాలుగో పోలీస్ స్టేషన్ సమీపంలో ౩౦ గుంటల స్థలాన్ని మున్నూరుకాపు జిల్లా సంఘానికి కేటాయించాలని కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో ఆరేళ్లుగా జిల్లా సంఘ భవనం కోసం ఎదురుచూస్తున్న ఆ కులస్తుల కోరిక జగన్‌ నేతృత్వంలో నేరవేరినట్టయ్యింది. ఈ సందర్భంగా జగన్‌ మంత్రి కేటీఆర్‌కు జిల్లా మున్నూరుకాపు కులస్తల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటికే ఈ భవన నిర్మాణానికి అర్బన్‌ ఎమ్మెల్యే నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలు, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ నిధుల నుంచి మూడు కోట్ల రూపాయలను కేటాయించారు. స్థలం కోసం మొన్నటి వరకు తండ్లాడిన మున్నురుకాపులకు ఈ సమస్య తీరడంతో పాటు అనువైన చోట, నగరం నడిబొడ్డున వినాయక్‌నగర్‌లో ౩౦ గుంటల విలువైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించేలా చొరవ తీసుకున్న నూతన అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్‌కు, సహకరించి మంత్రితో సమన్వయం చేసిన ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు ఈ సందర్బంగా మున్నూరుకాపు కులబాంధవులంతా ధన్యవాదాలు తెలిపారు.

జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ కులస్తులను జిల్లా వ్యాప్తంగా సమన్వయం చేసే కమిటీ మొన్నటి వరకు కొరవడింది. జిల్లా కమిటీ కొత్తగా ఏర్పడటం, జగన్‌ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయిన కొద్ది రోజుల్లోనే ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న సంఘ భవన నిర్మాణానికి, హాస్టల్‌ నిర్మాణానికి అనువైన, విలువైన స్థలం దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You missed