ధీ. సింగర్‌ పేరు. ఇదేందీ పేరు ఇలా ఉంది. పూర్తి పేరు దీక్షిత. తమిళ సింగర్‌. ఆకాశం నీ హద్దురా సూర్య సినిమాలో కాటుక కనులే… పాడింది ఈమే.. వెంకటేశ్ గురులో ఓ సక్కనోడా అంటూ తన హస్కీ గొంతుతో అందరినీ అలరించింది. కానీ ఇప్పుడు నాని దసరా సినిమాలో చమ్కీల అంగీలేసి ఓ వదినే.. చాకు లెక్కుండెటోడే ఓ వదినె అనే సాంగ్‌ పిచ్చి క్రేజ్‌ను తెచ్చిపెట్టిందామెకు. సినామా ఈ నెలాఖరుకు రిలీజ్‌. కానీ పాట మాత్రం మస్తు వైరల్ అయ్యింది. ఈ పాటల మీద డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలు సోషల్‌ మీడియోలో పెట్టుకుని మురిసిపోతున్నారు చాలా మంది. అంతగా క్రేజ్‌ సంపాదించిందీ సాంగ్‌. శ్యామ్‌ కాసర్ల రాసిన ఈ పాటను ధీతో పాటు రామ్‌ మిరియాల పాడాడు. బాగుంది పాట మీరూ ఓ సారి వినేయండి..

 

చమ్కీల అంగీలేసీ ఓ వదినే
చాకు లెక్కుండెటోడే ఓ వదినే
కండ్లకు ఐనా బెట్టి కత్తోలే
కన్నెట్ల కొడుతుండేనే

సినిగిన బనీనేసీ ఓ వదినే
నట్టింట్ల కూసుంటడే ఓ వదినే
మాసిన లుంగీ ఏసీ ఇప్పుడు
మంచంలనే పంటున్నడే..

పెండ్లైన కొత్తల
అత్తర్లు పూసిన్నె
నీ సీర సింగులు పట్టి
యెనుకెన్క తిరిగిన్నే

ముద్దులిస్తుండే పూలు తెస్తుండే
సక్కర లెక్క నీ మాటలుంటుండే
మారె నీ తీరు పెరిగే నీ నోరు
మందుకలవాటైతినే

కడుపుల ఇంత బోసి ఓ వదినె
కొడుతుండే బండకేసీ ఓ వదినె
అమవాస పున్నానికో అట్లట్ల
అక్కరకు పక్కకొస్తాడే

నోరిడిసి అడగదురా బామ్మర్ది
చెప్పింది చెయ్యదురా బామ్మర్ది
పక్కింట్ల కూసుంటది నా మీద
చాడీలు చెప్తుంటది

నా గొంతు కోసిండ్రంటు బామ్మర్ది
సాకులు పెడుతుంటదీ బామ్మర్ది
ముచ్చట్లు జెప్పబోతే మీయక్క
మూతంత తిప్పుకుంటది

సీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా
కంటికి రెప్పోలే కాస్తాడు మొగడు
యెంత లొల్లైనా నువ్వెంట అంటే
ఎదురు నిలిచి వాడు గెలిచి వస్తాడు

గోసైనా జూస్తా ఉన్నా ఏదైనా
గుండెల్లో దాస్తాడులే
నీ బొట్టు నీ గాజులే ఎంతైనా
వాని పాణానులే

 

You missed